జిల్లాకు రాని హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
Published Wed, Jan 1 2014 4:01 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
అరసవల్లి, న్యూస్‌లైన్: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఇంకా జిల్లాకు రాలేదని, వీటిని విక్రయించే సెంటర్‌ను త్వరలో తెలియజేస్తామని రవాణాశాఖ ఉప కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ‘న్యూస్‌లైన్‌తో’ ఆయన మాట్లాడారు. వాహనాలకు ఉండే నంబర్ ప్లేట్ల వ్యవహారంలో నిబంధనలు కఠినతరం చేస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టిందన్నారు. దీన్ని ప్రత్యేకంగా ఓ సంస్థకు కాంట్రాక్ట్ అప్పజెప్పిందన్నారు. పెలైట్ పాజెక్టు కింద రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో నంబర్ ప్లేట్ల ప్రక్రియ జరుగుతోందని, శ్రీకాకుళంలో ఇంకా ప్రారంభం కాలేదన్నారు. జిల్లా కేంద్రంలో పలు వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొత్తవి వస్తే వాటిని తీసేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచిగుర్తింపుపొందిన హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లుగా నమ్మించి దళారీలు ఎక్కువ సొమ్ము వసూలు చేసి మోసం చేస్తున్నారన్నారు. అలా ఎవరైన నంబర్ ప్లేట్లు ఇస్తామంటే తమకు తెలియజేయాలని కోరారు.
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
జిల్లాలో బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. పండుగ సమీపిస్తుండడంతో జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులపై దాడులు నిర్వహిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలపై కేసులు పెడతామన్నారు. రవాణాశాఖ నియమ నిబంధలను అనుగుణంగా వాహనాలు నడపక పోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ప్రైవేటు ఆపరేటర్లను హెచ్చరించారు. ఇప్పటి వరకు నిబంధనలను అతిక్రమించి తిరుగుతున్న బస్సులపై కేసులు రాయడం, అపరాధ రుసుము వసూలు చేయడం, కోర్టులో ప్రవేశపెట్టడం చేస్తున్నామని.. దీనివల్ల ఫలితం తక్కువగా ఉందన్నారు. ఇకపై నిబంధలనకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే అక్కడిక్కడే పర్మిట్ రద్దు చేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు అప్పగిస్తామని స్పష్టం చేశారు.
నిర్ధేశించిన మేరకే సీట్ల సంఖ్య ఉండాలని, రేడియం స్టిక్కర్లు అతికించాలని, దూరప్రాంతాలకు నడిపే బస్సుల్లో అనుభవం కలిగిన ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. కాంట్రాక్టు క్యారేజీ పద్ధతిలో మాత్రమే వాహనాలను నడపాలని, స్టేజ్ క్యారీయర్లుగా నడపవద్దని హెచ్చరించారు. ప్రయాణికులకు విడిగా టిక్కెట్లు, మధ్యలో ప్రయాణికులను ఎక్కించడం, దించడం చేయకూడదన్నారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల జాబితాను తెలిపే రిజిష్టరు తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణానికి ముందు దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో, రవాణా శాఖ కార్యాలయంలో తప్పనిసరిగా జాబితాను అందజేయాలన్నారు. రద్దీ సీజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి దాడులు నిర్వహిస్తామన్నారు.
దాడులకు వెళ్లిన అధికారులు నిలిచిన ప్రైవేటు బస్సులు
అరసవల్లి, న్యూస్‌లైన్:రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు చేసిన దాడుల నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేటు వాహనాల యాజమాన్యాలు మంగళవారం షాపులను మూసివేశారు. జిల్లా నుంచి ఒక్క ప్రైవేటు బస్సు కూడా కదలలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా దాడులు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు బస్సులను నడపలేదు. శ్రీకాకుళం, నరసన్నపేట, రాజాం, పాలకొండ, టెక్కలి, పలాసలలో దాడులు చేయడానికి వెళ్లిన అధికారులకు మూసివేసి ఉన్న అఫీసులు దర్శనమిచ్చాయి. శ్రీకాకుళం పట్టణంలోని ఎస్‌వీఆర్, కేవీఆర్, నవీన్, ఆపిల్, పద్మావతి తదితర ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కదల్లేదు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాల్లో 450 బడి, కళాశాలల బస్సులు, 27 కాంట్రాక్టు క్యారియర్ బస్సులు, 96 స్టేజి క్యారియర్ బస్సులున్నాయి. రోజూ జిల్లా కేంద్రం, ఇతర ప్రాంతాల నుంచి 25 బస్సులు అనధికారంగా మరో 70 పైగా ఇతర ప్రాంతాలకు
వెళ్తుంటాయి. మంగళవారం ఒక్కటి కూడా కదల్లేదు.
ఈ విషయమై రవాణాశాక ఉప కమిషనర్ ఎస్.వెంకటేశ్వరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు ఆపరేట్లపై దాడులు నిర్వహించామన్నారు. అయితే సోమవారం రాత్రి విజయవాడ, హైదరాబాద్‌లో అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని ప్రైవేటు ఆపరేటర్లు తమ కార్యాలయాలను, టికెట్లు విక్రయించేలేదన్నారు.
Advertisement
Advertisement