ఆస్పత్రుల పరిశీలన | Hospitals probation in srikakulam | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల పరిశీలన

Published Wed, May 18 2016 11:38 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Hospitals probation in srikakulam

నరసన్నపేట: స్థానిక యాభై పడకల ప్రభుత్వాస్పత్రితో పాటు మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీవీపీ విజిలెన్సు అధికారి కనకదుర్గ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఒక్కో అధికారిని ప్రభుత్వం పరిశీలన కోసం నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు ఈమెను నియమించారు. పరిశీలనలో భాగంగా వైద్య పరీక్షల తీరు, ఈ ఔషధి పని విధానంపై ఆరా తీశారు. ముందుగా మాకివలస పీహెచ్‌సీకి వెళ్లిన ఆమె సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
 
 మోడాల్ సంస్థకు వైద్య పరీక్షలు అప్పగించామని, ఎలా తనిఖీలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు రాస్తున్నట్లు విమర్శలు ఉన్నాయని, దీనిపై బాధ్యతగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల రక్త పరీక్షల రిపోర్టులు రాకముందే వైద్యులు మందులు రాస్తున్నారని అలాంటప్పుడు రక్త పరీక్షలు రాయడమెందుకని అన్నారు. నరసన్నపేట 50 పడకల ఆస్పత్రిలో కూడా వైద్యుల వారీగా పనితీరును తెలుసుకున్నారు. ఓపీ ఎంత ఉంది, వైద్య పరీక్షలు ఎలా రాస్తున్నారు అనేది పరిశీలించారు. ఈమె వెంట డీఎంహెచ్‌ఓ శ్యామల , డీసీహెచ్ సూర్యారావు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement