రాజ్యాంగాన్ని అవమానపరిచిన స్పీకర్, సీఎం
దిష్టిబొమ్మలు దహనం చేసిన న్యాయవాదులు
వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర పునర్విభజన బిల్లును తిరస్కరిస్తూ నోటీసు ఇచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు దాని మూజువాణి ఓటుతో ఆమోదించిన అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మ నోహర్ ఇరువురూ భారత రాజ్యాంగాన్ని, చట్టసభలను అవమానించారని జిల్లా న్యా యవాదులు ఆరోపించారు. ఈ మేరకు స్పీ కర్, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలతో హన్మకొండ సుబేదారిలోని జిల్లా కోర్టు నుంచి అ మరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహిం చి అక్కడ దహనం చేశారు.
గురువారం జ రిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మాట్లాడుతూ శాసనసభ వ్యవహారాలు రూల్ 77 కింద నోటీసు ఇవ్వాలంటే పది రోజుల కాలవ్యవధి ఉండాలనే కనీస నిబంధనను సైతం కాలదన్నిన స్పీకర్.. బిల్లుపై చర్చ ముగిసిందని చెప్పిన తర్వాత నోటీసు తీర్మాణాన్ని ప్రవేశపెట్టడం గర్హనీయమన్నారు. అయితే, సీఎం, స్పీకర్‌తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలుచేసినా తెలంగాణ ఏర్పాటవుతుం దని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
కా ర్యక్రమంలో బార్ అసోసియేషన్ కోశాధికారి ఊరుగొండ నరేందర్, న్యాయవాదు లు గుడిమల్ల రవికుమార్, చిల్లా రాజేంద్రప్రసాద్, నీలా శ్రీధర్‌రావు, అబ్దుల్‌నబీ, మొలుగూరి రంజిత్, కిశోర్‌కుమార్, సుధాకర్, సత్యరాజ్, నర్సింగరావు, ఇజ్జగిరి సురేష్, సీహెచ్.రమేష్ పాల్గొన్నారు.