కలెక్టరేట్,న్యూస్‌లైన్: ‘నేను మీకు తండ్రిలాంటి వాడిని.. పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఇంట్లో మందలించినట్లే ఉద్యోగులు తప్పు చేస్తే నేను అదే చేస్తున్నాను. అయినా నేను ఇంతవరకు ఓ ఇంజనీరు శాఖపై మాత్రమే దృష్టి సారించాను. మిగితా శాఖలపై అసలు దృష్టే పెట్టలేదు. తప్పుచేస్తున్న ఉద్యోగులను, నిర్ణయించిన లక్ష్యం చేరని ఉద్యోగులను మాత్రమే మందలిస్తున్నాను’ అని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పేర్కొన్నారు. బుధవారం ఉద్యోగ సం ఘాల ప్రతినిధులు కలెక్టర్‌తో సమావేశమయ్యా రు. కలెక్టర్ ప్రవర్తిస్తున్న తీరుతో ఉద్యోగులు మ నోవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
కారణాలు లేకుండానే ఉద్యోగులను వేధిస్తున్నారని కలెక్టర్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో స్పందించి న కలెక్టర్ మాట్లాడుతూ నేను ఇప్పటివరకు ఎవరి మన సు నొప్పించలేదని, నావల్ల ఎవరికీ బీపీ, షుగర్ వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఓ కుటుంబ పెద్దలా ఉద్యోగుల పనితీరును మెరు గుపరచడానికి కొంతమందిని మందలించ వల సి వస్తోందని పేర్కొన్నారు. అంతే కాని తనకు ఉద్యోగులపై ఎలాంటి కోపం లేదన్నారు. ఇదం తా చూస్తుంటే ఉద్యోగ సంఘాల వెనుక ఎవరి దో ప్రోద్బలం ఉన్నట్లు అనుమానం వస్తోందన్నారు. అవసరమైతే ఉద్యోగుల సమస్యలపై కలెక్టరేట్‌లో ‘ఉద్యోగవాణి’ఏర్పాటు చేస్తానన్నా రు. సమస్యలేవైనా ఉంటే అందులో చెప్పుకోవాలని ఉద్యోగలకు సూచించారు. అనంతరం తనకు గ్రూప్ అఫ్ మినిస్టర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ఉందని, తరువాత కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు.
ఈ సమావేశంలో టీఎన్‌జీఓస్ అధ్యక్ష,కార్యదర్శులు గంగారాం, కిషన్, సుధాకర్, అమృత్‌రావు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు సూర్యప్రకాష్, వెం కటయ్య, జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు రాములు, గంగాకిషన్, టీజీఓ అధ్యక్షులు బాబురావు, ఎంపీడీఓల సంఘం అధ్యక్షులు గోవింద్, కార్యదర్శి సాయన్న, వ్యవసాయధికారుల సంఘం నేతలు హరికృష్ణ, శ్రీక ర్, డా. బస్వరెడ్డి, డా.ప్రభాకర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు శంకర్, రాంజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తండ్రిలాంటి వాడిని.. ఉద్యోగ సంఘాల నేతలతో కలెక్టర్
Published Thu, Nov 7 2013 4:44 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement