ఠాగూర్ లాంటి సినిమా తీస్తా | I will make my next film like tagore, says Harish Shankar | Sakshi
Sakshi News home page

ఠాగూర్ లాంటి సినిమా తీస్తా

Published Tue, Jun 3 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

ఠాగూర్ లాంటి సినిమా తీస్తా

ఠాగూర్ లాంటి సినిమా తీస్తా

చాగల్లు, న్యూస్‌లైన్ : కష్టించి పనిచేసే వారికి చిత్ర పరిశ్రమలో తప్పక గుర్తింపు ఉంటుందని గబ్బర్‌సింగ్ చిత్ర డెరైక్టర్ హరీష్‌శంకర్ అన్నారు. చాగల్లులో తెలగా సంఘం వినాయకుడి ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సినిమా ప్రారంభించే ముందు చాగల్లు వినాయకుడి ఆలయంలో పూజ చేయడం అలవాటుగా మారిందన్నారు. త్వరలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇది తన ఐదో చిత్రమని అన్నారు. దర్శకుడు వీవీ వినాయక్ సోదరుడు లాంటి వారని, సినీ రంగంలో తననెంతగానో ప్రోత్సహించారని చెప్పారు. ఠాగూర్ లాంటి సందేశాత్మక చిత్రాలను తీయడమే తన లక్ష్యమన్నారు. యువతను ఆకట్టుకునేలా చిత్రాలు తీస్తానని చెప్పారు. హరీష్ శంకర్‌ను మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర కుమార్, ఏఎంసీ డెరైక్టర్ జుట్టా కొండలరావు, జూనియర్ ఆర్టిస్టులు దొమ్మేటి సత్యనారాయణమూర్తి, జి.సూరిబాబు, పంగిడి వెంకట్రావు, కె.పుట్టయ్య దుశ్శాలువాతో సత్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement