
ప్రణాళికాబద్ధంగా పని చేస్తే నాలుగేళ్లలో రాష్ట్రాభివృద్ధి
ప్రణాళికాబద్ధంగా పని చేస్తే నాలుగేళ్లలో నూతన రాష్ట్రాభివృద్ధి సాధ్యమేనని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో ఉపాధ్యాయులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
మార్టూరు : ప్రణాళికాబద్ధంగా పని చేస్తే నాలుగేళ్లలో నూతన రాష్ట్రాభివృద్ధి సాధ్యమేనని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో ఉపాధ్యాయులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. రాజీవ్‌విద్యామిషన్, సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్ పేరుతో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు.
అయినా నిర్థిష్టమైన ప్రణాళికలు లేకపోవడంతో ప్రాథమిక విద్యారంగం నేటికీ సంక్షోభంలోనే ఉందన్నారు. రాష్ట్రంలో 150 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయన్నారు. డీఎస్సీ తరువాత ఉపాధ్యాయులు రైషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీపతి వెంకట సుబ్బయ్య, విజయరాజు, మార్టూరు మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.