మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : మూడో విడత రచ్చబండ సందర్భంగా నూతనంగా పంపిణీ చేసిన టెంపరరీ కార్డుదారులకు కూపన్ల ఆధారంగా రేషన్ పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన సాక్షిలో ‘కూపన్లు సరే.. రేషన్ ఏదీ..?’ అనే కథనానికి స్పందించిన సివిల్ సప్లయీస్ అధికారులు గురువారం విచారణ నిర్వహించారు.
కాగా మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని రేషన్ దుకాణాలలో కొత్తకార్డుదారులకు రేషన్ ఇవ్వడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి డిసెంబర్‌కు సంబంధించిన రేషన్ కూపన్‌పై ఉన్న సరుకులు ఇదే నెలలో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సరుకులు తీసుకెళ్లే వారు కూడా ఈ విషయాన్ని గమనించి దుకాణాల వద్ద సరుకులు తీసుకెళ్లాలని తెలిపారు.
నెలాఖరులోగా రేషన్ ఇవ్వాలి
Published Fri, Dec 27 2013 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement