
ఆన్‌లైన్‌లో 25,577 ‘ఆర్జిత’ టికెట్లు
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి
తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించాక ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 25,577 ఆర్జితసేవా టికెట్లను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ బుకింగ్‌కు అందుబాటులోకి ఉంచామన్నారు. టీటీడీ ఆన్‌లైన్ సేవలు సులభంగా పొందేందుకు వీలుగా ‘పేమెంట్ గేట్‌వే’లోకి ఆంధ్రాబ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు ఎస్‌బీఐను కూడా చేర్చామన్నారు. జూలై 31వ తేదీ వరకు టీటీడీ ఆన్‌లైన్ సేవలు బుకింగ్ చేసుకుని సాంకేతిక కారణాలవల్ల టికెట్లు పొందని భక్తులు ఈనెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
దాతల సూచనమేరకు నగదు వాపస్
ఆనంద నిలయం-అనంతరం స్వర్ణమయం ప్రాజెక్టును సుప్రీంకోర్టు ఉత్తర్వులతో పూర్తిగా రద్దు చేశామని ఈవో సాంబశివరావు తెలిపారు. అందుకోసం భక్తులిచ్చిన సుమారు రూ. 13 కోట్ల నగదు, 145 కిలోల బంగారాన్ని లేఖల ద్వారా భక్తుల అభిప్రాయాలకు తగ్గట్టుగా తిరిగి ఇవ్వటం, మరికొన్ని టీటీడీ ట్రస్టులు, స్కీమ్‌లకు బదిలీ చేస్తున్నామని ఓ భకుని ప్రశ్నకు బదులుగా ఈవో తెలిపారు.