
సాక్షి, రామిరెడ్డిపల్లి (నందిగామ): ఎటువంటి ఎరువులు వినియోగించనప్పటికీ ఓ ఇంటి పెరట్లో పొట్ల పాదు ఏకంగా 8 అడుగుల మేర కాయలను ఇస్తూ చూపరులను అబ్బురపరుస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లెకంటి వెంకమ్మ తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పొట్ల విత్తనాలు నాటింది.
ఆ పాదు ఇప్పటికే వందకు పైగా పొట్లకాయల దిగుబడినిచ్చింది. ప్రతి కాయ సుమారు 7 అడుగుల నుంచి 8 అడుగుల వరకు ఉండటం గమనార్హం. చెట్టుకు ఎలాంటి ఎరువులు, మందులు వినియోగించలేదని వెంకమ్మ చెప్పారు. పందిరికి పాముల వలె వేలాడుతున్న పొట్లకాయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.