నకిలీ పాసు పుస్తకాల తయారీపై విచారణ ముమ్మరం | Investigation on Fake Pass books | Sakshi
Sakshi News home page

నకిలీ పాసు పుస్తకాల తయారీపై విచారణ ముమ్మరం

Published Tue, Jul 7 2015 4:23 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Investigation on Fake Pass books

అనంతపురం: అనంతపురం జిల్లాలో నకిలీ పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్టుతో రెవెన్యూ శాఖ విచారణ ముమ్మరం చేసింది. జిల్లా పరిధిలోని ధర్మవరం, కంబదూరులో ఉన్న ఆంధ్రా బ్యాంకు, కెనారా బ్యాంకులో రెవెన్యూ అధికారులు , పోలీసు బృందాలు రికార్డులను పరిశీలించాయి.

జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణను ముమ్మరం చేసినట్లు ఉన్నాతాధికారులు  తెలిపారు. మండలాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలీ పాసు పుస్తకాలు గుర్తిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కంబదూరు మండల కేంద్రంలోని వివిధ బ్యాంకుల్లో 500 నకిలీ పాస్ పుస్తకాలను రెవెన్యూ.. బ్యాంకు అధికారులు గుర్తించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement