
సాక్షి, అమరావతి/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితుల ఇళ్లు, కంపెనీ కార్యాలయాల్లో సోమవారం కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ ప్రత్యేక అధికారుల బృందం గత ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్ ఇళ్లల్లో, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ఇళ్లల్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా హవాలా రూపంలో నగదు పంపిణీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆదాయ పన్ను అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్‌లో ఆదాయపు పన్ను అధికారుల తనిఖీలు సోమవారం ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment