టీడీపీ టిక్కెట్‌ ఇస్తే పోటీచేస్తా: జేసీ | JC Prabhakar Reddy shows interest to contest on TDP ticket | Sakshi
Sakshi News home page

టీడీపీ టిక్కెట్‌ ఇస్తే పోటీచేస్తా: జేసీ

Nov 8 2013 3:00 PM | Updated on Aug 10 2018 7:58 PM

టీడీపీ టిక్కెట్‌ ఇస్తే పోటీచేస్తా: జేసీ - Sakshi

టీడీపీ టిక్కెట్‌ ఇస్తే పోటీచేస్తా: జేసీ

రాష్ట్ర మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది.

అనంతపురం: రాష్ట్ర మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమయింది. టీడీపీలో చేరుతున్నట్టు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌ ఇస్తే పోటీచేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగుతానని తెలిపారు. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తాను టీడీపీ అభ్యర్థిగా పోటీచేయడం ఖాయమని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంతకుముందు సన్నిహితుల వద్ద స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రభాకర్‌రెడ్డి సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుకూలంగా నిర్ణయంగా తీసుకోవడంతో ఆ పార్టీలో ఉంటే మనుగడ కష్టమని జేసీ సోదరులు భావిస్తున్నారు. దీంతో పార్టీ మారాలని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. టీడీపీలో చేరడానికి జేసీ సోదరులు ముహూర్తాన్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమయినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement