'చైతన్య విద్యార్థి మృతిపై న్యాయ విచారణ జరపాలి' | Judicial enquiry on Chaitanya School student death, demands YSR CP MLA Chevireddy Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

'చైతన్య విద్యార్థి మృతిపై న్యాయ విచారణ జరపాలి'

Published Thu, Sep 11 2014 11:37 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Judicial enquiry on Chaitanya School student death, demands YSR CP MLA Chevireddy Bhaskar Reddy

తిరుపతి: చైతన్య స్కూల్ విద్యార్థి మోహన్ కృష్ణ మృతిపై న్యాయ విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని స్థానిక కరణాల వీధిలోని చైతన్య స్కూల్ వద్ద గురువారం మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. రాష్ట్ర మంత్రి పి. నారాయణ ద్వంద్వ నీతిని పాటిస్తున్నారని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement