ఎన్నో కష్టాలు పడ్డా: జస్టిస్‌ బట్టు దేవానంద్‌ | Justice Battu Devanand Said He Had Reached This Level After Many Hardships | Sakshi
Sakshi News home page

మంచి న్యాయమూర్తిగా పేరు తెచ్చుకుంటా..

Published Sun, Mar 1 2020 2:38 PM | Last Updated on Sun, Mar 1 2020 3:03 PM

Justice Battu Devanand Said He Had Reached This Level After Many Hardships - Sakshi

సాక్షి, గుడివాడ: గొప్ప న్యాయమూర్తిగా కన్నా.. మంచి న్యాయమూర్తిగా పేరు తెచ్చుకుంటానని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సత్కార కార్యక్రమంలో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. వారు కష్టపడి చదివించారని.. 30 సంవత్సరాలుగా న్యాయవృత్తిలో ఉన్నానని చెప్పారు. ('గుడివాడ చరిత్రలో ఇది గొప్ప రోజు')

వ్యక్తిగత, వృత్తిపరంగా ఎన్నో కష్టాలు పడ్డానని పేర్కొన్నారు. డాక్టర్ కన్నా ఒక్క న్యాయ మూర్తినే మై లాట్ అని.. భగవంతుని ప్రతినిధి అంటారని పేర్కొన్నారు. గుడివాడ నుంచి ఈ స్థాయికి చేరడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. తాను ఈ స్థాయికి రావడానికి తాన కుటుంబసభ్యులే కారణమని తెలిపారు. గుడివాడకు మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement