కిరణ్ రెండు ప్రాంతాలకూ ముఖ్యమంత్రే: దిగ్విజయ్ | Kiran kumar reddy is CM for both regions, says Digvijaya singh | Sakshi
Sakshi News home page

కిరణ్ రెండు ప్రాంతాలకూ ముఖ్యమంత్రే: దిగ్విజయ్

Published Sat, Sep 28 2013 11:09 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్ రెండు ప్రాంతాలకూ ముఖ్యమంత్రే: దిగ్విజయ్ - Sakshi

కిరణ్ రెండు ప్రాంతాలకూ ముఖ్యమంత్రే: దిగ్విజయ్

రాష్ట్రం ఇంకా విడిపోలేదు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి రెండు ప్రాంతాల ప్రజలకూ ముఖ్యమంత్రేనని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. కిరణ్ మాట్లాడిన అంశాల గురించి తానింకా తెలుసుకోవాల్సి ఉందని, ఆయన తెలుగులో మాట్లాడారు కాబట్టి ఏం చెప్పారో చూడాలని దిగ్విజయ్ చెప్పారు. కిరణ్ మాటలను తర్జుమా చేయించుకున్న తర్వాత స్పందిస్తానని ఆయన అన్నారు.

ఇక రాష్ట్ర విభజనకు సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యుసీ తీసుకుందని, ఆ భేటీలో ఇరు ప్రాంతాలకు చెందిన నేతలతో తాము చర్చించామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు తమతో చెప్పారని, అందువల్లే ఒక నిర్ణయానికి వచ్చామని అన్నారు. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని, మిగిలిన పార్టీల్లాగా మేం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement