తొగుట, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి ఆరోపించారు. తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ విషయంలో సీంఎ వైఖరి సరిగా లేదన్నారు. ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరిద్దరు తెలంగాణ వ్యతిరేకులున్నారని వారిలో ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరన్నారు. తాము తెలంగాణ గడ్డపైనే పుట్టామని తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే స్థితిలో లేమన్నారు. దీనిపై టీఆర్‌ఎస్ నాయకులు తమపై లేనిపోసి నిందలు మోపుతున్నారన్నారు. ఉద్యమం పేరుతో టీఆర్‌ఎస్ నాయకులు పదవులు సంపాదించుకుంటున్నారన్నారు.
సర్వే కోసం వస్తే పాతరెయ్యండి
ప్రాణహిత- చేవెళ్ల నిర్మాణంలో తొగుట మండలంలోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎవరైనా అధికారులు సర్వే కోసం వస్తే అక్కడే పాతరెయ్యాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
రసాభాసగా రచ్చబండ
మండల పరిధిలోని గణపురం, తొగుట, గోవర్దనగిరి గ్రామాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్ నాయకులపై చిందులు వేయడమే ఇందుకు కారణమైంది. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఆయన శైలిలో మాటలకు పదును పెట్టారు. ఈ క్రమంలో గణపురం గ్రామంలో సర్పంచ్ అక్కం స్వామికి, ఎమ్మెల్యేకు మధ్య మాటామాటా పెరగడంతో తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని శాంతింపజేశారు. కాగా సర్పంచ్ స్వామి తమపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని ఆరోపించారు. తొగుటలో సొంత పార్టీ సర్పంచ్‌పైనే ఎమ్మెల్యే విరుచుకుపడటంతో ఆ పార్టీలోని విభేదాలు బట్టబయలయ్యాయి.
సీఎం ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకి
Published Mon, Nov 18 2013 12:36 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement