తాడికొండ: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ గడువు పొడిగించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇంకా ఎనిమిదివేల ఎకరాలు సమీకరించాల్సి ఉండడంతో గడువును పొడిగించి రైతులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రెండో విడత గడువు 12 రోజులుండగా మొత్తం ఈ ఎనిమిదివేల ఎకరాల సమీకరణ సాధ్యమేనా అన్నది ప్రశ్నగా మారింది. సగటున రోజుకు 700 ఎకరాలకు అంగీకార పత్రాలు అందిచాల్సి ఉంది. కొద్దిరోజులనుంచి మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌లు రాజధాని ప్రాంతంలో పర్యటనలు లేకపోవటం సమీకరణ నత్తనడకన కొనసాగుతుంది. గ్రామాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులే రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తుళ్ళూరు మండలం నేలపాడు, ఐనవోలు గ్రామాల్లో 97 శాతం సమీకరణ పూర్తిచేశారు. ఐనవోలులో మాత్రం ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతోనే 97 శాతం సమీకరణ సాధించామని డిప్యూటీ కలెక్టర్ ఏసురత్నం తెలిపారు.