పాత కాపులకే పెద్ద పీట! | large plateaus old! | Sakshi
Sakshi News home page

పాత కాపులకే పెద్ద పీట!

Published Wed, Dec 24 2014 4:16 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

పాత కాపులకే పెద్ద పీట! - Sakshi

పాత కాపులకే పెద్ద పీట!

సాక్షి ప్రతినిధి, కర్నూలు :  ఎన్నికల ముందు టికెట్ల కోసం వచ్చి తెలుగుదేశం గూటిలో చేరిన కాంగ్రెస్ వలస పక్షులకు చెక్ పడనుందా? గ్రూపు రాజకీయూలు ఉన్న ప్రాంతాల్లో ఇరువర్గాలను కాదని కొత్త వర్గాన్ని ప్రోత్సహించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధవువుతోందా? పార్టీని నముమకుని ఉన్న పాత కాపులకే పెద్ద పీట వేయూలని భావిస్తోందా? నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం పార్టీ వుంత్రాంగం గవునిస్తే ఇందుకు అవుననే సవూధానమే వస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ దేవాలయూల  కమిటీ చైర్మన్లు, వూర్కెట్ యూర్డు కమిటీ చైర్మన్ల భర్తీలో ఇదే విధానాన్ని అనుసరించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతా సక్రవుంగా సాగితే కొత్త ఏడాది మొదట్లోనే ‘రాజకీయు బాస్‌లు’ కొలువుదీరే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
 కాంగ్రెస్ వర్గానికి చెక్!
 నామినేటెడ్ పోస్టుల భర్తీలో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతలకు గట్టి షాక్ ఇచ్చేందుకు అధికార పార్టీ సిద్ధవువుతోంది. ఇందు కోసం నామినేటెడ్ పోస్టుల భర్తీని వేదికగా చేసుకుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా వూజీ కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన పేర్లను కాకుండా ఆయూ నామినేటెడ్ పోస్టుల్లో పార్టీని నవుు్మకుని ఉన్న పాత కాపులకే ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూత్రప్రాయుంగా నిర్ణరుుంచినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, పాణ్యం తదితర ప్రాంతాల్లో ఈ తరహా విధానం అవులుకానుందని సవూచారం. ఇందుకోసం గ్రూపు రాజకీయూలనే వ్యవహారాన్ని వుుందుకు తెచ్చేందుకు సిద్ధమైంది.
 
  ఉదాహరణకు నందికొట్కూరు వూర్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం ఇటు లబ్బి వెంకటస్వామి, అటు ఎన్నికల తర్వాత పార్టీ వూరిన శివానందరెడ్డి ప్రతిపాదించిన పేర్లు కేవలం ఆయూ గ్రూపులవేనని.. పార్టీని మొదటి నుంచి నవుు్మకున్న ఇతర వ్యక్తుల పేర్లను తెరమీదకు తేవడం ద్వారా ఇరు వర్గాలకు చెక్ పెట్టాలనేది పార్టీ భావనగా ఉంది. అదేవిధంగా వుహానంది దేవాలయు కమిటీ చైర్మన్ పోస్టు ఎంపికలోనూ శిల్పా మోహన్ రెడ్డికి కూడా ఇదే తరహాలో చెక్ పెట్టనున్నారు. ఎన్నికల వుుందు ఎమ్మెల్యేల టికెట్ల కోసం ఎగబడి తెలుగుదేశం పార్టీ చెంతకు చేరిన కాంగ్రెస్ నాయుకులకు మొత్తం మీద నామినేటెడ్ పోస్టుల భర్తీలో తవు రాజకీయు వూర్క్ అర్థవుయ్యేలా చేయూలనేది తెలుగుదేశం పాత తరం నేతలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
 
 కేఈ వర్గానికీ పరిమితులు!
 నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లా నుంచి ఉన్న ఏకైక వుంత్రిగా కేఈ కృష్ణవుూర్తి గుత్తాధిపత్యం ఉంటుందని అందరూ మొదట్లో భావించారు. అన్ని పోస్టులూ వారి వర్గానికే వస్తాయునే ప్రచారవుూ జరిగింది. అరుుతే, తీరా ప్రక్రియు దగ్గరకు వచ్చే కొద్దీ కేవలం డోన్, పత్తికొండ నియోజకవర్గాలకే వీరు పరిమితవుయ్యేటట్టు సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు శ్రీశైలం దేవస్థాన బోర్డు చైర్మన్ పోస్టు భర్తీ ప్రక్రియే అద్దం పట్టనుందనే అభిప్రాయుం రాజకీయువర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ పోస్టును తుగ్గలి నాగేంద్రకు ఇప్పించాలని కేఈ మొదటి నుంచీ యుత్నిస్తున్నారు. అయితే, చివరికి ఈ పోస్టు కాస్తా ఆలూరు నుంచి పోటీ చేసి ఓడిపోరుున వీరభద్రగౌడ్‌కు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే, ఆయన మాత్రం దీనిని తోసిపుచ్చుతున్నారు.
 
  అదేవిధంగా ఆయూ నియోజకవర్గాల్లో ఉన్న వూర్కెట్ కమిటీలకు పార్టీ ఇంచార్జీలే ప్రతిపాదించాలని కూడా ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. ఈ పరిణావూలను గమనిస్తే.. కేఈ వర్గానికి కేవలం రెండు నియోజకవర్గాల్లోనే పదవులు దక్కే అవకాశం ఉందని స్పష్టవువుతోంది. మొత్తం మీద నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియు అటు వూజీ కాంగ్రెస్ నాయుకులకు నిరాశే మిగల్చనుందని తెలుస్తోంది. అటు కేఈ వర్గానికి చెక్, ఇటు కాంగ్రెస్ వలస పక్షులకు బ్రేక్‌లతో ఈ పరిణావూలు కాస్తా పార్టీలో అంతర్గతంగా కొత్త విభేదాలకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయువుూ వ్యక్తవువుతోంది.  
 
 ఏకగ్రీవం... పోటాపోటీ...!
 నామినేటెడ్ పోస్టుల భర్తీలో కొన్ని చోట్ల ఏకగ్రీవంగా ఒకే పేరు వుుందుకు వస్తుండగా... వురికొన్ని చోట్ల పోటీ తీవ్రంగా ఉంటోంది. ఆదోని వూర్కెట్ యూర్డు కమిటీ చైర్మన్‌గా భాస్కర్‌రెడ్డి పేరును ఏకగ్రీవంగా అక్కడి నియోజకవర్గ నేతలు ప్రతిపాదించారు. ఇక కర్నూలు వూర్కెట్ యూర్డు విషయూనికి వస్తే శవుంతకవుణితో పాటు వుధుసూదన్, వుల్లెల పుల్లారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ పేర్లు ప్రవుుఖంగా వినిపిస్తున్నాయి.
 
 వుహానంది ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవికి పాణ్యం ప్రసాద్ పేరు ప్రచారంలో ఉండగా... నంద్యాల వూర్కెట్ యూర్డు చైర్మన్ పోస్టుకు వూజీ వుంత్రి ఫరూక్, జయుచంద్రారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇక శిల్పా వూత్రం వురొకరి పేరును తెరమీదకు తెస్తున్నారు. డోన్ నియోజకవర్గంలోని వుద్దిలేటి స్వామి ఆలయూనికి చైర్మన్‌గా వి. నాగయ్యు, పాణ్యం నియోజకవర్గంలోని కాల్వబుగ్గ ఆలయూనికి రవుణారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. డోన్ వూర్కెట్ యూర్డుకు వూత్రం మురళీకృష్ణారెడ్డి పేరు వూత్రమే ప్రచారంలో ఉంది. ఇక ఆళ్లగడ్డలో గంగుల వర్గం ఒక పేరును, రాంపుల్లారెడ్డి వర్గం వురో పేరును ప్రతిపాదిస్తున్నారుు.
 కొత్త ఏడాదిలో కొలువు!
 నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియు కొత్త ఏడాది మొదటివారంలోనే కొలిక్కి వస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి డిసెంబరు 15వ తేదీనాటికే పేర్లను ప్రతిపాదించాలని జిల్లా అధ్యక్షులకు పార్టీ అధిష్టానం ఆదేశించింది. అరుుతే, సభ్యత్వ నమోదు ప్రక్రియు ఉండటంతో ఇది కాస్తా వాయిదా పడింది. వుంగళవారం (23వ తేదీ)తో సభ్యత్వ నమోదు ప్రక్రియు పూర్తయింది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం నెలాఖరులోగా పేర్లను ప్రతిపాదించాలని తాజాగా అధిష్టానం ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియు ఊపందుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొత్త ఏడాది మొదటి వారంలోనే రాజకీయు బాస్‌లు కొలువుదీరే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement