నినాదాలతో మార్మోగిన శాసనమండలి
సమైక్యాంధ్ర, జైతెలంగాణ నినాదాలతో శాసనమండలి మార్మోగింది. సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియం చుట్టుముట్టారు. సభ్యులు వారి వారి స్థానాల్లో కూర్చొవాలని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి సందేశం టాప్ ప్రయారిటీని చైర్మన్ స్పష్టం చేశారు. సభ్యుల నినాదాల మధ్య దాదాపు అరగంట పాటు సభ నడిచింది. ఆ తర్వాత సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు.
డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రి గీతారెడ్డి బుధవారం మండలికి వచ్చారు. తిరిగి పదకొండు 45 నిమిషాల ప్రాంతంలో సమావేశమైన మండలి... మూడు నిమిషాల్లోనే రేపటికి వాయిదా పడింది. సభ్యులు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. నినాదాల మధ్య సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ ప్రకటించారు.