సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మంజీరా నదిపై లెండి ప్రాజెక్టు ఎగువ భాగం లో మరో మూడు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందు కు మహా సర్కారు కుట్ర పన్నుతోంది. కేంద్ర జలవనరుల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం బాబ్లీ గేట్ల మూసివేత సందర్భంగా వారు మా ట్లాడిన తీరు చూస్తుంటే జిల్లాకు తాగు, సాగునీటి గండం తప్పదనిపిస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు అక్టోబర్ 28 నుంచి జూన్ 30 వరకు బాబ్లీ గేట్లను మూసివేసే అవకాశం ఉంది. ఎనిమిది నెలలు బాబ్లీ గేట్లు మూసి ఉంచడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని 60 టీఎంసీల నీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉం టుంది. గేట్లను తెరిచిన కూడా సాగర్‌లోని ఈ నీరు బాబ్లీలోకి వెళుతుందని పేర్కొంటున్నారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు తీవ్ర నష్టం వాటిల్లినుంది. బాబ్లీ గేట్ల మూసి వేత సందర్భంగా మ హారాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పేర్కొన్న తీరును పరిశీలిస్తే అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండిని బాబ్లీలాగానే దక్కించుకునేందుకు కుట్రపన్నుతున్నట్లు తెలుస్తుం ది. ఇదే జరిగితే జుక్కల్ నియోజకవర్గంలోని 22,700 ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే అవకాశాలు స్పష్టమవుతున్నాయి.మహారాష్ట్ర,ఆంధ్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీరానదిపై లెండి ప్రాజెక్టు ఎగు వ భాగంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలను ని ర్మించేందుకు మహారాష్ట్ర కుట్ర చేస్తోంది.
లెండిపై కన్నేసిన ‘మహా’ సర్కారు
Published Wed, Oct 30 2013 4:25 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement