విజయనగరం జిల్లా పార్వతీపురం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద విద్యుదాఘాతానికి గురై బీఎస్‌ఎన్‌ఎల్ లైన్ మ్యాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీపురం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద విద్యుదాఘాతానికి గురై బీఎస్‌ఎన్‌ఎల్ లైన్ మ్యాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సబ్ స్టేషన్ వద్ద ఫోన్ పని చేయకపోతే సరి చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ లైన్‌మ్యాన్ ఎం.ఆదినారాయణ (45) శనివారం అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న విద్యుత్ తీగలను అతడు తాకడంతో షాక్‌కు గురై కింద పడిపోయాడు. దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో స్థానికులు వెంటనే స్పందించి.... అతడిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.