కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: హమాలీల సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23వ తేదీన హైదరాబాదులోని ఏపీబీసీఎల్ మేనేజింగ్ డైరక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు గౌరవాధ్యక్షుడు శివశంకర్ తెలిపారు.
కడప కలెక్టరేట్ ఎదుట హమాలీలు రిలే నిరాహార దీక్షా శిబిరంలో గురువారం ఆయన మాట్లాడారు.హ మాలీల సమస్యలు పరిష్కరించాలని 72 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలను ప్రభుత్వంగాని, అధికారులుగాని ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. దిగుమతి టెండర్ విధానాన్ని రద్దు చేయాలని, హమాలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఇవ్వాలని, హమాలీలకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన కోర్కెలను కోరడం తప్పా అని ప్రశ్నించారు.
20 సంవత్సరాలుగా హమాలీలు ఐఎంఎల్ డిపోను నమ్ముకుని పనిచేస్తున్నా వారిని రెగ్యులర్ చేయకుండా దిగుమతి టెండర్‌తో హమాలీల కడుకొట్టేలా కాంట్రాక్టు పద్ధతి తీసుకురావాలని ప్రభుత్వం యోచించడాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదని విమర్శించారు. అన్ని సమస్యల పరిష్కారాన్ని కోరుతూ హైదరాబాద్‌లోని ఎండీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షల్లో సి రవిశంకరరెడ్డి, వి సుధాకరరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రెడ్డెయ్య, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
రేపు ఏపీబీసీఎల్ ఎండీ కార్యాలయం ముట్టడి
Published Fri, Nov 22 2013 2:29 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM
Advertisement
Advertisement