
కోతకు గురైన తీర ప్రాంతం సముద్ర గర్భంలో కలిసిన సిమెంటు రోడ్డు, కొబ్బరి చెట్లు, దెబ్బతిన్న ఇల్లు
సాక్షి, కొత్తపల్లి (తూర్పుగోదావరి) : నిండు గంభీరంగా ఉండే సముద్రుడే ఎగసిపడితే.. తట్టుకోవడం కష్టమే. అదే జరిగింది పొన్నాడ శివారు కోనపాపపేటలో. వారం రోజులుగా సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతం కడలికోతకు గురైంది. సుమారు 10 మత్స్యకారుల గృహాలు కూలిపోయాయి. అనేకమంది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. తీరంలోని రోడ్డు, చెట్లు సాగర గర్భంలో కలిశాయి. కోతకు గురైన ఈ గృహాలను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిశీలించి ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేయడమే కాకుండా ఇంటి రుణాలను మంజూరు చేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment