మధ్యాహ్న భోజన చార్జీలు పెంచాలి | Menu charges in relation to the public schools to increase the term of the mid-day meal scheme | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజన చార్జీలు పెంచాలి

Published Mon, Dec 2 2013 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

Menu charges in relation to the public schools to increase the term of the mid-day meal scheme

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూ చార్జీలు పెంచాలని మధ్యాహ్న భోజన పథక నిర్వాహక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరల క్ష్మి డిమాండ్ చేశారు. నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి సదస్సు నిర్వహించారు. అంతకుముందు రైల్వేస్టేషన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కణపాక సమీపంలోని సీఐటీయూ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం విధానాల వల్ల పిల్లకు సరైన పౌష్టికాహారం అందడం లేదన్నారు. మెనూ ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా ధరలు పెంచకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొందని మండిపడ్డారు. నిర్వాహకులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.  మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, వర్కింగ్ ఉమెన్స్ అధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సుధారాణి, సీఐటీయూ నాయకులు టీవీ.రమణ, పి.శంకరరావు, డేగల అప్పారావు, రెడ్డి శ్రీదేవి, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement