అధికారులతో కలెక్టర్ ఎం.ఎం.నాయక్
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలపై దృష్టి సారించి ఏరోజు నివేదిక ఆరోజు తన సెల్‌కు మెసేజ్ పెట్టాలని కలెక్టర్ ఎం.ఎం. నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో ఆర్వీఎం, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మా ట్లాడు తూ ప్రతి పాఠశాలలో తాగునీరు ఉండాలన్నారు. టాయ్‌లెట్లు పనిచేస్తుండాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలకూ వెళ్లి ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎన్ని టాయ్‌లెట్లు ఉన్నాయి. అన్నవి ఆరా తీయాలనానరు. అదేవిధంగా బోరుబావులు పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయాలను గుర్తించాలన్నారు.
అదేవిధంగా మరమ్మతులు ఎక్కడ అవసరం ఉన్నవీ గుర్తించాలన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ గ్రాంట్ కింద ప్రతి పాఠశాలకూ రూ.25వే లను మంజూరు చేశామన్నారు. ఆ నిధులతో ఎంఈఓలు, ఏఈలు కలసి చిన్నపాటి మరమ్మతులు చేయవచ్చన్నారు. అటువంటి మరమ్మతులను చేపట్టి వెంటనే తనకు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ సిబ్బంది నిత్యం పర్యటిస్తూ ఉండాలన్నారు. ఎస్‌ఈ పనిచేస్తేనే ఏఈ కూడా పనిచేస్తారన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అందరూ కలసి పనిచేయాలన్నారు. కురుస్తున్న వర్షాల వలన గ్రామాలు, పట్టణాల్లోని ప్రాంతాలతో పాటు ఆయా పాఠశాలల్లో బురద, చిత్తడి ఉంటాయనీ అక్కడ బ్లీచింగ్ వేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్‌లతో పాఠశాలల్లో తాగునీటి పైప్‌లకోసం మాట్లాడామనీ వెంటనే ఆయా కమిషనర్‌లను సంప్రదించాలన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో టాప్ కనెక్షన్ల కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
మున్సిపల్ పాఠశాలల్లో ఇతరులు టాయ్‌లెట్లను వినియోగిస్తున్నారనీ, దీని వలన విద్యార్థులు వినియోగించుకునే వెసులుబాటు ఉండదన్నారు. ఇతరులు వీటిని వినియోగించకుండా మున్సిపల్ కమిషనర్‌లతో మాట్లాడి ప్రతి పాఠశాలకూ ప్రహరీలు నిర్మించాలన్నారు. పబ్లిక్‌ను ఈ విధంగా నివారించగలమన్నారు. మున్సిపల్ స్కూళ్ల నిర్వహణపై హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించి పాఠశాలలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని డీఈఓ కృష్ణారావుకు ఆదేశించారు.
సమగ్రమైన నివేదికలు ఇవ్వకుండా మొక్కుబడిగా నివేదికలు ఇవ్వడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు తన సెల్‌కు సమా చారాన్ని పంపించాలన్నారు. అదేవిధంగా ప్రతిరోజూ తీసుకున్న నిర్ణయాలను, చేపడుతున్న చర్యలను సాయంత్రమయ్యే సరికి జాయింట్ కలెక్టర్‌కు కార్యక్రమాల పూర్తి నివేదికను పంపించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్వీఎం పీఓ శారద, డీఈఓ కృష్ణారావు, పంచాయితీ అధికారి మోహనరావు, గ్రామీణ నీటిసరఫరా శాఖ ఎస్‌ఈ మెహర్ ప్రసాద్, ఆర్వీఎం ఇంజనీర్లు పాల్గొన్నారు.
నా సెల్‌కు మెసేజ్ పెట్టండి
Published Sat, Jul 19 2014 3:34 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement