RVM
-
సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వ్రస్తానికి గిట్టుబాటు ధర లేక నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘ఆధునిక మగ్గాలు ఆగాయి’శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్ వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్‌టైల్‌పార్క్‌లోని యూనిట్లకు ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్‌రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. 1.30 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నామని వివరించారు. టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలపై షరి్టంగ్ వస్త్రం, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై సూటింగ్, ఓనీ వ్రస్తాన్ని ఉత్పత్తి చేసే ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఆర్వీఎం ఆర్డర్ల విలువ రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. 50 శాతం కాటన్‌తో వ్రస్తాల ఉత్పత్తి గతానికి భిన్నంగా 50 శాతం కాటన్ నూలుతో కలిపి ఆర్వీఎం వ్రస్తాలను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కోసం ఈ వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నారు. వ్రస్తోత్పత్తికి ముందే నూలును వార్పిన్ చేసి, సైజింగ్ చేసిన తరువాత మగ్గాలపై వ్రస్తాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. గతంలో ప్లెయిన్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రింటింగ్ చేయించేవారు. కానీ ఈసారి వీవింగ్లోనే డిజైన్లు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు. -
ఆర్వీఎంపై అనుమానాలు సహజమే!
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా 91.2 కోట్ల మంది ఓటర్లు ఉంటే... వారిలో 32.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఇందుకు అనేక కారణాలు. అందులో ముఖ్యమైనది బతుకు తెరువు కోసం వలసపోవటం. ఓటింగ్ శాతంపై సుప్రీంకోర్టుకు కూడా అనేక వినతులు అందాయి. వ్యాజ్యాలూ దాఖలయ్యాయి. ఆ నేపథ్యంలోనే 2015లో సుప్రీంకోర్టు ఓటింగ్ శాతం పెంచే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (సీఈసీ) ఆదేశించింది. దీంతో ఎన్నికల సంఘం అనేక అంశాలను పరిశీలించింది. ఇప్పటికే పరోక్ష ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, ఇంటర్నెట్ ఓటింగ్, ముందస్తు ఓటింగ్ వంటి విధానాలు అమల్లో ఉన్నాయి. అయితే ఆ విధానాలను అత్యధికులు ఉపయోగించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు కోట్లాదిగా ఉన్న వలస ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం, ఒకేసారి అనేక (72) నియోజకవర్గాల పరిధిలో ఉన్నవారు రిమోట్ ఓటింగ్ మిషన్ (ఆర్వీఎం)ను ఉపయోగించి ఓటువేయడానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. ఈ ఆర్వీఎంలను పరిశీలించేందుకు, వాటి పనితీరుపై అభ్యంతరాలను తెలిపేందుకు, జనవరి 16, సోమవారం ప్రయోగాత్మక పరిశీలనా ప్రదర్శనకు రావాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం.. గుర్తింపు పొందిన 8 జాతీయ పార్టీలను, 57 రాష్ట్ర పార్టీలను ఆహ్వానించింది. పరిశీలన తర్వాత తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా జనవరి 31 నాటికి అందించాలని ఈసీ కోరింది. అయితే ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో 16 ప్రతిపక్షాలు సమావేశమై తాము ఆర్వీఎంలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే అనేక పార్టీలు ఆర్వీఎంల అవసరం లేదని పేర్కొన్నాయి. దీంతో ఆర్వీఎంలపై మరింత చర్చించి తమ అభిప్రాయాలను చెప్పాలని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించింది. ఈవీఎంలపై అనుమానాలే పూర్తిగా తగ్గని వేళ, ఈ ఆర్వీఎంలపై మరిన్ని సందేహాలు రావడం సహజమే. – డాక్టర్ తాతా సేవకుమార్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ -
ఖర్చు చేశారు... లెక్కచెప్పరు
శ్రీకాకుళం: శ్రీకాకుళం రాజీవ్ విద్యా మిషన్(ప్రస్తుత సర్వశిక్షా అభియాన్)లో నిధుల ఖర్చుకు సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా గత అధికారులు ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదు. గత పీవో రామచంద్రారెడ్డి, అప్పటి ఇన్చార్జి ఎఫ్ఏఓ, ప్రస్తుత అసిస్టెంట్ ఎఫ్ఏఓ అయిన సురేష్ రూ. 2.5 లక్షలను సొంతం పేరిట విత్‌డ్రా చేసి వాటికి తగిన బిల్లులు సమర్పించకపోవడంతో ఆడిట్ అధికారులు కొద్ది నెలల క్రితం అభ్యంతరం తెలిపారు. దీనిపై తక్షణం బిల్లులు సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు అటువంటి దాఖలాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా శిక్షణకు గాని, మరేదైనా పనులకు గాని నిధులను సొంతం పేరిట విత్‌డ్రా చేసి, అటు తర్వాత బిల్లులను సమర్పించుకునే సౌలభ్యం ఆర్వీఎంలో ఉంది. దీనిని వినియోగించుకునే వీరిద్దరూ నిధులను విత్‌డ్రా చేశారు. అయితే ఇప్పటికీ లెక్కలు చెప్పకపోవడం పలువురి సందేహాలకు కారణమైంది. అప్పటి పీవో రామచంద్రారెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓ సమావేశానికి ఇతడు పూర్తి సమాచారంతో రాలేదన్న కారణంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాతృ శాఖకు సరెండర్ చేసిన విషయం పాఠకులకు విదితమే. అయితే ఏ కారణంగానో తెలియకపోయినా మంత్రి ఆదేశాలు సుమారు రెండు నెలలు అమలుకు నోచుకోలేదు. ఈ రెండు నెలల్లో మరిన్ని ఆరోపణలు రావడంతో కలెక్టర్ రిలీవ్ చేసేశారు. అప్పట్లో ఎఫ్‌ఏఓగా పనిచేసిన రాజు మాతృ సంస్థకు వెళ్లిపోవడంతో సురేష్ ఇన్చార్జి ఎఫ్‌ఏఓగా వ్యవహరించారు. ఈ సమయంలోనే రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేశారు. ఈ మొత్తంతో కేజీబీవీ సిబ్బంది, ఎంఐఎస్ కోర్డినేటర్లకు శిక్షణ ఇచ్చినట్టు మౌఖికంగా చెబుతున్నా బిల్లులు మాత్రం దాఖలు చేయలేదు. ఆడిట్ అధికారుల అభ్యంతరం తర్వాత కూడా బిల్లులు దాఖలుకు ప్రయత్నాలే జరగలేదు. ఈ కారణంగానే పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలను బలం చేకూరుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రస్తుత ఆర్వీఎం అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారనే ఆక్షేపణలు వినిపిస్తున్నారుు. ఇదే శాఖలో అసిస్టెంట్ ఎఫ్‌ఏఓగా పనిచేస్తున్న సురేష్‌కు ఇప్పటికి రెండు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాగా సురేష్‌ను ప్రస్తుత పీఓ కూడా సుమారు 6 నెలల పాటు రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు కాదని ఇన్చార్జి ఎఫ్‌ఏఓగా కొనసాగించడం, ఎఫ్‌ఏఓగా రాష్ట్ర అధికారుల ద్వారా నియమించబడిన మోహనరావును విధుల్లో చేర్చుకోకుండా గాలిలో ఉంచడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తక్షణం యూసీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్వీఎం పీఓ త్రినాథరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా రెండు రోజుల క్రితమే యూసీలు ఇచ్చారన్నారు. యూసీలు ఇవ్వకపోవడంతో గతంలో ఆడిట్ అభ్యంతరం చెప్పడం నిజమేనని తెలిపారు. -
ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు
మర్రిగూడ : కస్తూరిబా పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌ఓతోపాటు ఉపాధ్యాయులంతా తరచు గైర్హాజరు కావద్దని ఆర్వీఎం జిల్లా జీసీడీఓ ఎం.సుశీల అన్నారు. శనివారం మర్రిగూడ కస్తూరాబా పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చడించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంనతం పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పాఠశాల ఎస్ఓ పనితీరు బాగాలేక పోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు మంచి బోధన అందించాలన్నారు. ఆమెవెంట ఎంఈఓ ఎం.సుధాకర్ ఎస్ఓ వాసవి, తదితరులు ఉన్నారు. -
ఆర్వీఎంకు సిరిసిల్ల వస్త్రం
తొలి రోజు లక్షా 60 వేల మీటర్ల గుడ్డ కొనుగోలు సిరిసిల్లలలో పాతిక లక్షల మీటర్ల వస్త్రం సిద్ధం సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని చేనేత, జౌళిశాఖ అధికారులు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో లక్షా 60 వేల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశారు. రెండు మ్యాక్స్ సొసైటీల ద్వారా ఈ వస్త్రాన్ని కొన్నారు. సిరిసిల్లలోని 51 మ్యాక్స్ సొసైటీల్లో ఉత్పత్తి అయిన గుడ్డను మాత్రమే కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం సిరిసిల్లలో 25 లక్షల మీటర్ల వస్త్రం సిద్ధంగా ఉంది. రోజు వారీగా ఈ వస్త్రాన్ని కొనుగోలు చేస్తామని జౌళిశాఖ ఆర్డీడీ రమణమూర్తి తెలిపారు. రాజీవ్ విద్యా మిషన్‌కు మొత్తం కోటి 35 లక్షల మీటర్ల వస్త్రం అవసరం ఉండగా.. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కార్మికులకు ఈ అవకాశాన్ని కల్పించారు. రూ.45 కోట్లు విలువైన వస్త్రాన్ని సిరిసిల్ల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. మొదటి విడతగా 37 లక్షల మీటర్ల గుడ్డను కొనుగోలు చేసేందుకు సిరిసిల్ల మ్యాక్స్ సొసైటీలకు ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 25 లక్షల మీటర్ల వస్త్రం రెండువేల పవర్‌లూమ్స్‌పై పక్షం నెల రోజుల్లో ఉత్పత్తి అయింది. మిగితా ఆర్డర్‌ను పూర్తి చేసేందుకు వస్త్రోత్పత్తిదారులు సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమంలో జౌళిశాఖ అధికారులు పూర్ణచందర్రావు, ఏడీలు ఎం.వెంకటేశం, రతన్‌కుమార్, డి.వి.రావు, డీవో రశీద్, మ్యాక్స్ సొసైటీ అధ్యక్షులు బీమరి రామచంద్రం, జౌళిశాఖ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
వాస్తు దోషమట
ఆర్వీఎంలో నిధులు దుబారా పీవో చాంబర్ మార్పు.. మరుగుదొడ్లు మరో చోటికి పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధుల కొరత ఇక్కడేమో వృథా ప్రయాస ఆదిలాబాద్ టౌన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) కార్యాలయూనికి వాస్తు దోషమట..! ఎన్ని విమర్శలు వచ్చినా ఆర్వీఎం అధికారుల తీరు మారడం లేదు. పీవోలు మారినప్పుడల్లా కార్యాలయ భవనంలో మార్పుల పేరిట లక్షల నిధులు దుబారా చేస్తున్నారు. దీనికి అంతే లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే అనేక అక్రమాలకు నిలయంగా మారిన ఆర్వీఎంలో తాజాగా నిధుల దుబారా వ్యవహారం విస్తు పోయేలా చేస్తోంది. ఒక వైపు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అసౌకర్యానికి గురవుతుంటే.. ఇక్కడేమో అధికారులు పాఠశాలల్లో వసతులకు వెచ్చించాల్సిన లక్షల రూపాయల నిధులను తమ కార్యాలయాల్లో వాస్తు దోషం పేరిట వెచ్చించడంపై విమర్శలు వస్తున్నారుు. ఇన్‌చార్జీగా ఉన్న అధికారి ఇలా వాస్తు దోషాల పేరిట మార్పులు చేయిస్తుండడంలో మర్మమేమిటో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారి మారినప్పుడల్లా.. ఆర్వీఎంలో పీవోలు మారినప్పుడల్లా సౌకర్యం, సౌలభ్యం, వాసు ్తదోషాల పేరిట భవనంలో ఏదో ఒక మార్పులు చేసుకుంటూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఇన్చార్జి పీవోగా ఉన్న శ్రీనివాస్‌ను తప్పించి డీఆర్డీఏ ఏపీడీగా ఉన్న రాజేశ్వర్ రాథోడ్‌ను నెల రోజుల క్రితం నియమించారు. తాజాగా ఆర్వీఎం భవనంలో వాస్తుదోషం ఉందని ఓ పంచాగకర్త చెప్పడంతో ఆగమేఘాలపై భవనంలో మార్పులకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం సెక్టోరియల్ అధికారులు ఉన గదిని పీవో చాంబర్‌గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్టోరియల్ అధికారుల కోసం ప్రస్తుతం మరుగుదొడ్లను తొలగించి దాన్ని మరో గదికి కలుపుతూ నిర్మించాలని యోచిస్తున్నారు. మరుగుదొడ్లను వేరే చోటికి మెట్ల కిందకు తరలిస్తున్నారు. దీనికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో పీవోలుగా పని చేసిన వారు మారినప్పుడల్లా వారి అనువుకు తగ్గట్టు చాంబర్‌ను మార్చుకుంటూ వచ్చారు. పాఠశాలల్లో వసతులు కరువు జిల్లాలో పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, తాగునీటి సదుపాయం, ప్రహరీలు, విద్యుత్ సరఫరా, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇతర అవసరాల నిమిత్తం రూ.310 కోట్లు అవసరమని ఆర్వీఎం అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. విద్యా సంవత్సరాలు అనేకంగా మారుతున్న విద్యార్థులకు వసతులు సమకూరడం లేదు. లక్షల నిధులతో ఎన్నో పాఠశాలల్లో చిన్నపాటి వసతులను మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి. అధికారులు తమ సౌకర్యం కోసం కార్యాలయాల్లో మార్పులకు వెచ్చిస్తున్న నిధులతో పాఠశాలల్లో కొన్ని సమస్యలైనా తీర్చగలిగే పరిస్థితి ఉన్నప్పటికి ఆర్వీఎం అధికారులు అలాంటి వాటికి అసక్తి చూపరన్న విమర్శలు ఉన్నాయి. ఆర్వీఎం భవనంలో ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకున్నా వాస్తుదోషం పేరిట నిధులు వెచ్చిచేందుకు మాత్రం ఆర్వీఎం అధికారులు వెనుకాముందు ఆలోచించకుండా ఖర్చు చేయడంలో స్వార్థం ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. విశాలంగా ఉంచేందు కోసం.. కార్యాలయం ఇరుకుగా ఉంది. ఉద్యోగుల సౌలభ్యం కోసం గదులను విశాలంగా చేసేందుకు మరుగుదొడ్లలను తొలగించాం. పై అంతస్తులో ఉన్న అన్ని విభాగాలను గ్రౌండ్ ఫ్లోర్‌కు తీసుకువస్తాం. రికార్డు గదిని పైకి మారుస్తాం. - రాజేశ్వర్ రాథోడ్, ఆర్వీఎం పీవో -
వేటు పడినా..సీటులోనే
భానుగుడి (కాకినాడ) :సర్వశిక్షాభియాన్‌ను ‘సర్వభక్షాభియాన్’గా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) పీఓ వెన్నపు చక్రధరరావుపై వేటు వేస్తూ ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్వీఎం ప్రవేశపెట్టిన పలు పథకాల అమలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తొలగించి, విచారణ జరిపించాలని ఆ శాఖ డెరైక్టర్ ఉషారాణి ఆదేశించారు. వెన్నపు అవినీతి, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఆధారాలు మాయం కావడంపై ‘సాక్షి’ ‘సర్వ‘భక్ష’ అభియాన్’, ‘వాటి మాయం వెనుక మర్మమేమిటో’ పేరిట ప్రచురించిన కథనాలతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. అయితే ఈనెల 4న జారీ అయిన ఆదేశాలపై ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంతో వెన్నపు తన స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. ఇవీ ఆరోపణలు బడుగు విద్యార్థులకు స్కూల్బ్యాగ్ల పంపిణీ, ఏకరూప దుస్తులు, కార్ల వినియోగంలో, అధికారులకు టీఏ, డీఏ కేటాయింపులో, కేజీబీవీ ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారని, 2013లో రిపబ్లిక్‌డే శకటాల తయారీలో కలెక్టర్ ఆదేశాల్ని బేఖాతరు చేశారని, 2010 ఆర్‌ఎస్‌టీసీ నిధుల బడ్జెట్ విషయంలో తప్పుడు గణాంకాలు చూపారని వెన్నపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 13-5-2013 మే 13న ఉద్యోగంలో చేరినా ఆలనెల నాలుగు నుంచి వేతనం తీసుకున్నారన్న ఆరోపణా ఉంది. జూలైలోనే మంత్రికి ఫిర్యాదు వెన్నపు అవినీతిపై స్వచ్ఛంద సంస్థలు మంత్రి గంటా శ్రీనివాసరావుకు జులై 7న ఫిర్యాదు చేయగా విచార ణ జరిపించాలని కలెక్టర్ ను ఆదేశించారు. కలెక్టర్ ఏజేసీ మార్కండేయులు ఆధ్వర్యంలో నియమించిన కమిటీ ఫిర్యాదులోని 9 అంశాల్లో ఏడింటికి ఆధారాలు ఉన్నాయని తేల్చింది. ఈ నివేదికను కలెక్టర్ ఆగస్టు 13న వి ద్యాశాఖ డెరైక్టర్‌కు అందించిన నేపథ్యంలో ఆర్వీఎం డెరైక్టర్ వెన్నపును తక్షణం విధుల నుంచి తొలగించి, విచారణ జరిపించాలని ఈనెల 4న ఆదేశించారు. రెండు వారాలు కావస్తున్నా.. ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం, ఆయన పీఓగా కొనసాగడం గమనా ర్హం. వెన్నపుపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన స్వచ్ఛంద సంస్థలే కాక ఆర్వీఎం ఉద్యోగులూ కోరడం విశేషం. -
నా సెల్‌కు మెసేజ్ పెట్టండి
అధికారులతో కలెక్టర్ ఎం.ఎం.నాయక్ విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలపై దృష్టి సారించి ఏరోజు నివేదిక ఆరోజు తన సెల్‌కు మెసేజ్ పెట్టాలని కలెక్టర్ ఎం.ఎం. నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో ఆర్వీఎం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మా ట్లాడు తూ ప్రతి పాఠశాలలో తాగునీరు ఉండాలన్నారు. టాయ్లెట్లు పనిచేస్తుండాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలకూ వెళ్లి ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎన్ని టాయ్లెట్లు ఉన్నాయి. అన్నవి ఆరా తీయాలనానరు. అదేవిధంగా బోరుబావులు పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయాలను గుర్తించాలన్నారు. అదేవిధంగా మరమ్మతులు ఎక్కడ అవసరం ఉన్నవీ గుర్తించాలన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ గ్రాంట్ కింద ప్రతి పాఠశాలకూ రూ.25వే లను మంజూరు చేశామన్నారు. ఆ నిధులతో ఎంఈఓలు, ఏఈలు కలసి చిన్నపాటి మరమ్మతులు చేయవచ్చన్నారు. అటువంటి మరమ్మతులను చేపట్టి వెంటనే తనకు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ సిబ్బంది నిత్యం పర్యటిస్తూ ఉండాలన్నారు. ఎస్ఈ పనిచేస్తేనే ఏఈ కూడా పనిచేస్తారన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అందరూ కలసి పనిచేయాలన్నారు. కురుస్తున్న వర్షాల వలన గ్రామాలు, పట్టణాల్లోని ప్రాంతాలతో పాటు ఆయా పాఠశాలల్లో బురద, చిత్తడి ఉంటాయనీ అక్కడ బ్లీచింగ్ వేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లతో పాఠశాలల్లో తాగునీటి పైప్లకోసం మాట్లాడామనీ వెంటనే ఆయా కమిషనర్లను సంప్రదించాలన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో టాప్ కనెక్షన్ల కోసం చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇతరులు టాయ్లెట్లను వినియోగిస్తున్నారనీ, దీని వలన విద్యార్థులు వినియోగించుకునే వెసులుబాటు ఉండదన్నారు. ఇతరులు వీటిని వినియోగించకుండా మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి ప్రతి పాఠశాలకూ ప్రహరీలు నిర్మించాలన్నారు. పబ్లిక్‌ను ఈ విధంగా నివారించగలమన్నారు. మున్సిపల్ స్కూళ్ల నిర్వహణపై హెచ్ఎంలతో సమావేశం నిర్వహించి పాఠశాలలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని డీఈఓ కృష్ణారావుకు ఆదేశించారు. సమగ్రమైన నివేదికలు ఇవ్వకుండా మొక్కుబడిగా నివేదికలు ఇవ్వడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు తన సెల్‌కు సమా చారాన్ని పంపించాలన్నారు. అదేవిధంగా ప్రతిరోజూ తీసుకున్న నిర్ణయాలను, చేపడుతున్న చర్యలను సాయంత్రమయ్యే సరికి జాయింట్ కలెక్టర్‌కు కార్యక్రమాల పూర్తి నివేదికను పంపించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్వీఎం పీఓ శారద, డీఈఓ కృష్ణారావు, పంచాయితీ అధికారి మోహనరావు, గ్రామీణ నీటిసరఫరా శాఖ ఎస్ఈ మెహర్ ప్రసాద్, ఆర్వీఎం ఇంజనీర్లు పాల్గొన్నారు. -
నోట్‌బుక్స్ దాచారు!
ఆర్వీఎం నిర్లక్ష్యం కేజీబీవీలకు అందని నోట్స్ కరీంనగర్ కేజీబీవీలో భద్రం రవాణా వారి బాధ్యత కాదట పిల్లలకు పంచేది ఇంకెప్పుడో 7800 మందికి ఇబ్బందులు విద్యా సంవత్సరం ఆరంభమై నెల రోజులు దాటింది. ఇప్పటికీ.. సర్కారు సరఫరా చేసిన నోట్‌బుక్స్‌ను పిల్లలకు పంచే దిక్కులేదు. పాఠ్యపుస్తకాలు, దుస్తులతో పాటు జూన్‌లో పంపిణీ చేయాల్సిన నోట్‌బుక్స్ జిల్లాకేంద్రంలోనే మూలుగుతున్నాయి. వీటిని పాఠశాలలకు రవాణా చేయాల్సిన అధికారులు.. అది తమ బాధ్యత కాదన్నట్లుగా చేతులెత్తేశారు. జిల్లా కేంద్రంలోనే ఓ పాఠశాలలో వీటిని భద్రపరిచారు. సప్తగిరి కాలనీలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని ఓ తరగతి గదిలో ఈ నోట్‌బుక్స్ బండిల్స్‌ను పడేసి తాళం వేశారు. దీంతో కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న బాలికలు ఇబ్బంది పడుతున్నారు. తమకు బోధించే పాఠాలు రాసుకునేందుకు నోట్స్ తామే కొనుక్కోవాలా.. లేదా సర్కారు పంపిణీ చేస్తుందా... అర్థంకాక బిత్తరపోతున్నారు. రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణమిది. జిల్లాలో 51 కస్తూరిబా గాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాలున్నాయి. వీటిలో తొమ్మిది పాఠశాలలను రెసిడెన్షియల్ సొసైటీలు నిర్వహిస్తున్నాయి. మిగతా 42 పాఠశాలలు ఆర్వీఎం ప్రాజెక్టు ఆఫీసరు పర్యవేక్షణలో నడుస్తున్నాయి. వీటిలో ఈ విద్యా సంవత్సరం 7,800 మంది బాలికలు చదువుకుంటున్నట్లు రికార్డులున్నాయి. బాలకార్మికులు, అనాథలు, డ్రాపవుట్స్, ఇప్పటికీ బడిలో చేరనివారు, ఎయిడ్స్ బాధితుల పిల్లలకు రెసిడెన్షియల్ పద్ధతిలో బోధన, వసతి సదుపాయాలు కల్పించే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం కేజీబీవీలు నెలకొల్పింది. పాఠ్యపుస్తకాలు, దుస్తులతో పాటు ఇక్కడి పిల్లలకు ఒక్కొక్కరికి 16 నోట్‌బుక్స్‌ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. పిల్లల సంఖ్యకు సరిపడేన్ని నోట్‌బుక్స్‌ను సర్కారు గత నెలలోనే పంపించింది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీఎల్) ఈ బుక్స్‌ను కేజీబీవీలకు సరఫరా చేస్తోంది. జిల్లాకు నోట్‌బుక్స్ వచ్చాయని.. వీటిని పాఠశాలలకు చేరవేయాల్సిన బాధ్యత వారిదేనని ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు. కానీ.. నెల రోజులైనా వీటిని పాఠశాలలకు చేరవేయకపోతే చదువుకునే విద్యార్థులు నోట్స్ ఎలా రాసుకుంటారని ఆలోచించకపోవడం గమనార్హం. మరో లోడ్ నోట్‌బుక్స్ రావాల్సి ఉందని.. అవి వచ్చాక ఏపీటీపీసీఎల్ వీటిని పాఠశాలలకు రవాణా చేస్తుందని ఆర్వీఎం పీవో రాజమౌళి వివరణ ఇచ్చారు. ఖర్చుతో కూడుకున్న పని కావటంతో తాము రవాణా చేయటం లేదని చెప్పారు. -
దేశంలో 29 రాష్ట్రాలట!
కర్నూలు: రాష్ట్ర విభజన జరగకముందే రాజీవ్ విద్యామిషన్ ఓ అడుగు ముందుకేసింది. అర్ధసంవత్సరం (సమ్మెటివ్-2) పరీక్షల్లో దేశంలో 29 రాష్ట్రాలున్నట్లుగా, రాష్ట్రం విడిపోయినట్లుగా చూపింది. ఈ నెల 8వ తేదీన జరగాల్సిన 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం, 8వ తరగతి తెలుగు మీడియం సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించి పత్రాలను ఉపాధ్యాయులు పరిశీలించారు. ఇందులో 29వ ప్రశ్నగా భారత దేశ పటం ఇచ్చి కలకత్తా, చెన్నూ, ముంబై, లక్నో, ఢిల్లీ ప్రధాన నగరాలను గుర్తించాలని పేర్కొన్నారు. వీటికి అయిదు మార్కులు ఇచ్చారు. అంతా బాగానే ఉన్నా చిత్రపటంలో సీమాంధ్ర, తెలంగాణ విడివిడి రాష్ట్రాలుగా విభజించి చూపడం ఉపధ్యాయులకు ఆశ్చర్యంతోపాటు ఆగ్రహాన్ని కలిగించింది. స్పందించిన డీఈవో కె. నాగేశ్వరరావు 29వ ప్రశ్నకు మార్కులుండవని ప్రకటించారు. -
జిరాక్స్ పేపర్లతో హెచ్ఎంల పాట్లు
వర్గల్,న్యూస్‌లైన్: సీసీఈ విధానంలో విద్యార్థుల సమగ్ర మదింపు కోసం నిర్వహిస్తున్న అర్థ వార్షిక పరీక్షలు తొలి రోజు అభాసుపాలయ్యాయి. గురువారం వర్గల్ మండలంలోని అనేక పాఠశాలల్లో జిరాక్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు నెట్టుకొచ్చారు. ప్రశ్నపత్రాలు సక్రమంగా పంపిణీ చేయడంలో ఆర్వీఎం విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వర్గల్ మండలంలో 37 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలున్నాయి. వర్గల్, పాములపర్తి, మజీద్‌పల్లి, తున్కిఖాల్సా, వేలూరు ,నెంటూరు కాంప్లెక్సుల పరిధిలో ఇవి ఉన్నాయి. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు గురువారం అర్థవార్షిక పరీక్షలు ప్రారంభ మయ్యాయి. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రశ్న పత్రాలు అనేక పాఠశాలలకు సక్రమంగా అందలేదు ‘సాక్షి’ దినపత్రిక ద్వారా ఈ పరిస్థితి వెలుగులోకి రావడంతో ఆర్వీఎం అధికారులు ప్రశ్నపత్రాల సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. ఏ పాఠశాలకు అదనంగా ప్రశ్నపత్రాలు చేరాయో సమాచారం సేకరించి, వాటిని కొరత నెలకొన్న మండలాలకు చేరవేసే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. మండలంలో ప్రధానంగా పాములపర్తి, తున్కిఖాల్సా, నెంటూరు కాంప్లెక్సుల పరిధిలో ప్రశ్నపత్రాల కొరత గుర్తించారు. తొలిరోజు గురువారం తెలుగు పరీక్ష జరగాల్సిఉండగా పాములపర్తి, గౌరారం, పాతూరు, తున్కిఖాల్సా పాఠశాలలకు ఏడో తరగతి ప్రశ్నపత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో పాఠశాలల హెచ్ఎంలు పరిస్థితిని మండల విద్యాధికారి దృష్టికి తీసుకవెళ్లారు. -
మూణ్నాళ్ల ముచ్చటే నా..!
ఖమ్మం, న్యూస్‌లైన్ : కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల ప్రత్యేకాధికారుల ఉద్యోగం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. రాజీవ్ విద్యామిషన్ అధికారులు కేజీబీవీ ఎస్‌వోలకు ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చి పాఠశాలకు వెళ్లమని చెప్పారు. అయితే మైదాన ప్రాంత అభ్యర్థులు ఏజన్సీ పాఠశాలల్లో పనిచేయడానికి ఒప్పుకునేది లేదని, ఇక్కడి నుంచి తిరిగి వెళ్లాలని ఐటీడీఏ అధికారులు ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలను వదులుకున్న ఎస్వోలు గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటూ ఆర్వీఎం అధికారి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. బాలికల విద్యను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను ప్రారంభించారు. ఇలా జిల్లాలో ఆర్వీఎం ఆధ్వర్యంలో 21, ఏపీఆర్ఈఐఎస్ పరిధిలో నాలుగు, ఏపీడబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో ఎనిమిది మొత్తం 33 పాఠశాలలు మంజూరు చేశారు. వీటి నిర్వహణకు ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉపాధ్యాయులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరి పర్యవేక్షణ లోపంతో కేజీబీవీ లక్ష్యం నెరవేరడం లేదని అభిప్రాయపడిన రాష్ట్ర అధికారులు.. ప్రత్యేక అధికారుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు వరంగల్‌లో రాత పరీక్ష నిర్వహించి తొలుత 28 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత వయసు తక్కువగా ఉందని ఒకరిని, ఏ కారణం చూపకుండానే మరొకరిని పక్కన పెట్టి మిగితా 26 మందికి ఎస్‌వోలుగా నియామక పత్రాలు అందజేశారు. ఇందులో 17 మందిని ఏజెన్సీ ప్రాంత పాఠశాలలకు, 9 మందిని మైదాన ప్రాంతాలకు పంపించారు. అయితే మైదాన ప్రాంత ఎస్‌వోలకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన వారిలో కూనవరం మినహా మిగితా 16 మంది మైదాన ప్రాంత అభ్యర్థులే కావడంతో వారు ఇక్కడ ఉద్యోగం చేసేందుకు అనర్హులని, తక్షణమే ఇక్కడినుంచి వెళ్లాలని ఐటీడీఏ పీవో ఆదేశించారు. నెలకు రూ.20 వేల వేతనం, బాలికలకు విద్య బోధించడం, మహిళా ఉపాధ్యాయులతోనే కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఉత్సాహంగా వెళ్లిన ఎస్వోలు అక్కడ ఏర్పడిన పరిస్థితితో కంగుతిన్నారు. ఏజన్సీ, మైదాన ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటారనే విషయం తమకు నోటిఫికేషన్ సందర్భంగా కానీ, నియామక పత్రాలు ఇచ్చినప్పుడు కానీ చెప్పలేదని ఆర్వీఎం పీవో శ్రీనివాస్ ఎదుట మంగళవారం తమ గోడు వినిపించారు. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో మెరిట్ సాధించామని, తమ స్వగ్రామాలకు దగ్గరగా ఉంటుందనే ఆలోచనతో ఏజెన్సీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నామని, అక్కడికి వెళ్తే ఈ పరిస్థితి ఎదురైందని వాపోయారు. దీనికోసం వెళ్తే గతంలో చేసిన ఉద్యోగం పోయిందని, ఇప్పుడు ఈ ఉద్యోగానికి అవకాశం లేకుంటే తమ పరిస్థితి ఏమిటని, ఎలాగైనా న్యాయం చేయాలని పీవోను వేడుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా ఈ విషయాన్ని రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎస్‌వోల నియామక ప్రక్రియ అంతా హైదరాబాద్‌లోని ఆర్వీఎం ప్రధాన కార్యాలయంలోనే జరిగింది. అప్పటి వరకు ఎస్వోలు స్థానికంగా ఉన్న కేజీబీవీల్లోకి వెళ్లి సీఆర్టీలుగా పనిచేయవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే వారివారి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. - శ్రీనివాస్, ఆర్వీఎం పీవో -
‘భవిత’కు లేదు భరోసా
కనిగిరి, న్యూస్‌లైన్: ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ తదితర శిక్షణలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు ఆర్వీఎం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘భవిత’ కేంద్రాలు అసౌకర్యాలతో కునారిల్లుతున్నాయి. జిల్లాలోని 19 భవిత కేంద్రాల్లో సుమారు 400 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలు శిక్షణ పొందుతున్నారు. వికలాంగుల భవిత కోసం... జిల్లాలో భవిత కేంద్రాలకు ఒక్కోదానికి రూ.9 లక్షలతో 19 చోట్ల పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో తాళ్లూరు, దర్శి, త్రిపురాంతకంలో ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. బేస్తవారిపేటలో భవన నిర్మాణం మధ్యలోనే ఆగింది. నాలుగు చోట్ల స్థలాలే దొరకలేదు. భవిత భవనాలు కట్టని చోట ఎమ్మార్సీ కార్యాలయంలోనే శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవనాలున్న చోట పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. అనేక చోట్ల తాగునీటి వసతి లేదు. కేంద్రాల్లో కనిపించని 2-6 ఏళ్ల పిల్లలు: భవిత భవనాల్లో 7-14 సంవత్సరాల (మానసిక వైకల్యం, చెవుడు, మూగ, అంధత్వం కలిగిన) పిల్లలకు ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ (నాన్ రెసిడెన్షియల్) స్కూల్, 2-6 ఏళ్ల లోపు (మానసిక వైకల్యం, చెవుడు, మూగ, అంధత్వం కలిగిన) పిల్లలకు ఎర్లీ ఇంటర్వెన్షన్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. వీరికి శిక్షకులు వారంలో ఐదు రోజులు శిక్షణ ఇస్తారు. శనివారం మాత్రం ప్రత్యేక అవసరాలున్న పిల్లల ఇళ్లకు వెళ్లి శిక్షణలిస్తారు. అయితే భవిత భవనాల్లో 7-14 సంవత్సరాల వయసున్న పిల్లలు శిక్షణ పొందుతున్నా..2-6 ఏళ్ల వయసున్న పిల్లలు ఎక్కడా రావడం లేదు. అధికారులు పిల్లల తల్లిదండ్రులకు తగిన అవగాహన కల్పించకపోవడం, ప్రభుత్వం కనీస సహకారం అందించకపోవడమే దీనికి కారణం. ఇవ్వని రవాణా అలవెన్స్ నిధులు... జిల్లాలో 19 భవిత కేంద్రాల్లో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలను జూన్‌లో ప్రారంభించారు. 7-14 సంవత్సరాల వయసున్న పిల్లలకు రవాణా అలవెన్స్‌ను ఒక్కొక్కరికి నెలకు రూ.300 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. కానీ అవి ఈ ఏడాది ఇప్పటి వరకు ఇవ్వలేదు. గుంటూరు జిల్లాలో నగదుకు బదులు పిల్లల్ని భవిత భవనాలకు తీసుకొచ్చేందుకు వాహనాలు సమకూర్చినట్లు సమాచారం. కానీ మన జిల్లాలో అవి కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలున్న పిల్లల్ని రోజూ శిక్షణలకు తీసుకొచ్చే స్థోమత లేక ఇళ్లల్లో ఉంటున్నారు. ఒకవేళ ఇబ్బందులు పడి తీసుకొచ్చినా..వారికి అక్కడ కనీస సౌకర్యాలుండటం లేదు. దీంతో అనేక మంది భవిత కేంద్రాలకు దూరమవుతున్నారు. ఐఈ ఏమంటున్నారంటే... దీనిపై రాజీవ్ విద్యామిషన్ ఐఈ(ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్) వెంకారెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ అడగ్గా రవాణా అలవెన్స్ నిధులు ఇంకా ఇవ్వలేదన్నారు. త్వరలో పిల్లల తల్లిదండ్రుల అకౌంట్‌కు నిధులు జమ చేస్తామని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం కొన్ని చోట్ల అమలు కానిది వాస్తవమేనన్నారు. మౌలిక వసతులు అన్ని చోట్ల కల్పిస్తామని చెప్పారు. 2-6 ఏళ్ల వయసున్న పిల్లలు పూర్తిస్థాయిలో వచ్చేట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాస్టల్ వసతి కల్పించండి రమణమ్మ, వెంకటేశ్వరపురం మా పిల్లలను భవిత కార్యాలయంలోనే ఉంచుతాం. రోజూ తీసుకొచ్చేందుకు మా దగ్గర చార్జీలకు డబ్బులు లేవు. కూలీ చేసుకుని జీవించే వాళ్లం రోజూ రావాలంటే కుదరడం లేదు. అలాగని బిడ్డ భవిష్యత్‌ను నాశనం చేసుకోలేను. హాస్టల్ సౌకర్యం కల్పిస్తే ఇక్కడే చేర్చి వారానికి ఒక్కరోజు వచ్చి చూసుకుంటాం. ఇబ్బంది పడుతున్నాం వెంకట సుబ్బమ్మ, సుల్తాన్పురం ప్రభుత్వం రవాణా చార్జీలను వెంటనే విడుదల చేయాలి. లేదంటే రవాణాకు వాహన సౌకర్యాలు కల్పించాలి. రోజూ తిరగలేక అనేక మంది తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలున్న పిల్లలను తీసుకు రాలేకపోతున్నారు. -
లెక్క తప్పింది..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాజీవ్ విద్యా మిషన్‌ను లెక్కల చిక్కులు చుట్టుముట్టాయి. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏ పద్దు కింద ఎంత మొత్తం ఉందనే లెక్క తేలకపోవడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంది. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులు విడుదల చేసింది. వీటిలో కొంత భాగం నేరుగా పాఠశాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, మరికొన్ని జిల్లా ప్రాజెక్టు అధికారి ఖాతాలో జమయ్యాయి. కాగా, వీటిని కూడా పాఠశాల ఖాతాకు బదిలీ చేశారు. దాదాపు పదేళ్లుగా ఈ ప్రక్రియ సాగింది. దండిగా నిధులు విడుదల చేయడం తప్ప.. ఏ పద్దు కింద ఎన్ని నిధులు ఖర్చు చేస్తుది అటు జిల్లా ప్రాజెక్టు యంత్రాంగం గానీ, ఇటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గానీ ప్రత్యేకంగా లెక్కలు రాయలేదు. ఇటీవల ప్రభుత్వం మిగులు నిధులను వెనక్కు పంపాలని ఆదేశించింది. లెక్కల్లో స్పష్టత లేకపోవడంతో చాలా నిధులు వెనక్కు రాకుండా పాఠశాల ఖాతాల్లోనూ మూలుగుతున్నాయి. ఈ లెక్కలు తేల్చే క్రమంలో భాగంగా ఆర్వీఎం అధికారులు మూడు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నప్పకీ ఏటూ తేలకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. తిరిగొచ్చింది సగమే.. జిల్లాలో 2,314 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,640 ప్రాథమిక పాఠశాలలు, 247 ప్రాథమికోన్నత పాఠశాలలు కాగా మరో 427 ఉన్నత పాఠశాలలున్నాయి. పాఠశాల గ్రాంట్లు, నిర్మాణ పనులు, నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన, అభ్యసన నిధులు తదితర దాదాపు 18 కిపైగా పద్దుల కింద ఏటా ప్రతి పాఠశాలకు నిధులు విడుదలవుతున్నాయి. నిధులు విడుదల చేసే అంశంపై యంత్రాంగం ఆదినుంచి ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో ఏ పద్దు కింద ఎంత నిధులిచ్చాం.. ఎంత ఖర్చయ్యాయి.. మిగులు నిధులెన్ని.. అనే విషయాలపై దృష్టి సారించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో వచ్చిన నిధులను అడ్డదిడ్డంగా ఖర్చు చేసి ఉపాధ్యాయులు చేతులు దులుపుకొన్నారు. ఇటీవల నిధులు వెనక్కు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా ఆర్వీఎం అధికారులు ఉపాధ్యాయుల నుంచి తెప్పించేందుకు ఉపక్రమించింది. జిల్లాలో మొత్తంగా రూ.32 కోట్లు పాఠశాలల ఖాతాల్లో ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. ఈ మేరకు చర్యలకు దిగిన యంత్రాంగానికి ఇప్పటివరకు కేవలం రూ.14 కోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయి. మరో రూ.8కోట్ల మేర విద్యార్థుల యూనిఫాం బిల్లుల నేపథ్యంలో వాటిని అట్టిపెట్టినప్పటికీ.. మరో రూ.10 కోట్ల మేర లెక్కలు తేలడం లేదు. బడి నుంచే తేల్చేద్దాం.. క్షేత్ర స్థాయిలో ఏ పద్దు కింద ఎన్ని నిధుల ఉన్నాయనే విషయాన్ని తేల్చేందుకు రాజీవ్ విద్యామిషన్ ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించింది. రెండ్రోజుల క్రితం జరిగిన విద్యాధికారుల సమావేశంలో ఈ ప్రొఫార్మాలను వారికి అందించింది. వీటిని పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులకు పంపి వారం రోజుల్లో వివరాలు ఇవ్వాలని మండల విద్యాధికారులకు స్పష్టం చేసింది. ఇందులో 18 కాలమ్స్‌తో కూడిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలు వచ్చిన అనంతరం వాటిని క్రోడీకరించి జిల్లా స్థాయి వివరాలను తయారు చేస్తామని జిల్లా ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి కిషన్‌రావు ‘సాక్షి’కి వివరించారు.