దేశంలో 29 రాష్ట్రాలట!
కర్నూలు: రాష్ట్ర విభజన జరగకముందే రాజీవ్ విద్యామిషన్ ఓ అడుగు ముందుకేసింది. అర్ధసంవత్సరం (సమ్మెటివ్-2) పరీక్షల్లో దేశంలో 29 రాష్ట్రాలున్నట్లుగా, రాష్ట్రం విడిపోయినట్లుగా చూపింది. ఈ నెల 8వ తేదీన జరగాల్సిన 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం, 8వ తరగతి తెలుగు మీడియం సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించి పత్రాలను ఉపాధ్యాయులు పరిశీలించారు. ఇందులో 29వ ప్రశ్నగా భారత దేశ పటం ఇచ్చి కలకత్తా, చెన్నూ, ముంబై, లక్నో, ఢిల్లీ ప్రధాన నగరాలను గుర్తించాలని పేర్కొన్నారు.
వీటికి అయిదు మార్కులు ఇచ్చారు. అంతా బాగానే ఉన్నా చిత్రపటంలో సీమాంధ్ర, తెలంగాణ విడివిడి రాష్ట్రాలుగా విభజించి చూపడం ఉపధ్యాయులకు ఆశ్చర్యంతోపాటు ఆగ్రహాన్ని కలిగించింది. స్పందించిన డీఈవో కె. నాగేశ్వరరావు 29వ ప్రశ్నకు మార్కులుండవని ప్రకటించారు.