ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం కాస్త మెరుగుపడేందుకు ప్రభుత్వం బిల్లులను పెంచింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి భోజనంపై 35 పైసలు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థికి భోజనంపై *.1.35పైసలు పెం చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం కాస్త మెరుగుపడేందుకు ప్రభుత్వం బిల్లులను పెంచింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి భోజనంపై 35 పైసలు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థికి భోజనంపై *.1.35పైసలు పెం చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు గడిచిన జూలై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అరకొరగా వడ్డించిన భోజనానికి ప్రభుత్వం పెంచిన ధరలు కొంతమేర తోడ్పాటునందించనున్నాయి.
పెరిగిన నిత్యావసరాలతో పోల్చితే..
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మధ్యా హ్న భోజనం వడ్డించడం ఆయా ఏజెన్సీలకు తలకు మించిన భారంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి కొంత ఊరటనిచ్చింది. జిల్లాలో సుమారు 3,300ల పైచిలుకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సుమారు 2లక్షలకుపైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజ నాన్ని అందజేస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి భోజనానికి గాను *.4 ఖర్చు చేస్తుండగా పెంచిన 35 పైసలతో *.4.35పైసలు, ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్కో విద్యార్థి భోజనానికి *.4.65 ఖర్చు చేస్తుండగా పెరిగిన *.1.35 పైసలతో కలిసి *.6 లకు చేరింది. పెరిగిన నిత్యావసర ధరలతో పోల్చుకుంటే పెంచిన ధరలు ఏమాత్రం సరిపోయే పరిస్థితి మాత్రం కనపడటం లేదు.
పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థుల వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో 75 శాతం కేంద్రప్రభుత్వం, 25 శాతం రా ష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా యి. రాష్ట్రంలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరి స్తుంది. కేంద్రప్రభుత్వం మధ్యాహ్న భోజన ధరలను పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమేరకు ధరలను పెంచి ఉత్తర్వులు విడుదల చేసింది.