ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి పితాని సత్యనారాయణ
శ్రీకాకుళం రూరల్ : రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కార్యాలయ భవనాన్ని ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శక పాలన దిశగా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటుందన్నారు.
అవినీతిని అరికట్టేందుకు, ప్రజల సమస్యలు తెలిపేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకొచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే ముఖ్య మంత్రి ఉద్దేశమన్నారు. ఒకప్పుడు దేశంలో అవినీతిలో 3వ స్థానంలో ఏపీ రాష్ట్రం ఉండగా, ప్రస్తుతం 19వ స్థానానికి తగ్గిందన్నారు. భవిష్యత్తులో అవినీతిలేని రాష్ట్రాన్ని చూడాలన్నారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ ఆర్.పి.ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువ కావడానికి తమ శాఖ కృషి చేస్తుందన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా ఫిర్యాదు చేసేందుకు 1064 టోల్‌ఫీ నంబర్‌తో పాటు వాట్సాప్ నంబర్(8333995858)ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, జిల్లా పరిషత్ అ«ధ్యక్షులు చౌదరి ధనలక్ష్మి, శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, ఏసీబీ ఓఎస్‌డీ ఎ.అబ్రహం లింకన్, ఎస్పీ సి.ఎం.త్రివిక్రమవర్మ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ టి.మోహనరావు, రెవెన్యూ డివిజనల్ అ«ధికారి బలివాడ దయాని««ధి, ఏసీబీ డీఎస్పీ కె.రాజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment