సాక్షి, విజయవాడ: చంద్రబాబుది మహానాడు కాదు.. మాయనాడు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి టీడీపీ తొలగించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కాలంలోనే 90శాతం హామీలను నెరవేర్చారని తెలిపారు.(‘నక్క అరిస్తే సింహం గర్జించినట్లు కాదు’)
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా భావిస్తుందన్నారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరమని.. పేదలందరికీ వైద్యం అందించాలన్నదే సీఎం జగన్ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా హెల్త్‌కార్డులు వినియోగించుకునేలా వైఎస్ జగన్ సంకల్పించారని తెలిపారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో పేదల ఆరోగ్యంపై చంద్రబాబు అనేక స్కామ్‌లకు పాల్పడ్డారని మంత్రి విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని సీఎం జగన్ పూర్తి ప్రక్షాళన చేశారని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. (బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది)
Comments
Please login to add a commentAdd a comment