
సాక్షి, అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ నవరత్నాల్లో భాగంగా రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకంపై స్వామినాథన్ హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈ పథకం మనోధైర్యం నింపిందని కొనియాడారు. దివంగత నేత వైఎస్సార్‌తో రైతాంగం కోసం అనేకసార్లు కలిసి పనిచేశానని ఆయన పేర్కొన్నారు. ‘మీ నాయకత్వంలో రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలకు నా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని సీఎం వైవెస్ జగన్‌ను ఉద్దేశించి ఎంఎస్ స్వామినాథన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.