ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణలో, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, మధిరలో ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో జిల్లాపరిషత్ ఆవరణలోని ప్రత్యేకాధికారి ఛాం బర్‌లో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లకు సమగ్ర అవగాహన ఉండాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ పార్టీల ప్రచార పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని ఆదేశిస్తూ ఆయా పార్టీల ప్రతినిధులకు నోటీసులు ఇవ్వాలన్నారు. నోటీసులకు స్పందించకపోతే.. వాటి ని గురువారం సాయంత్రం తొలగించాలని చెప్పారు. ఇక ముందు, పార్టీల ప్రచార పోస్టర్లు, బ్యానర్లు ముందస్తు అనుమతితో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచార ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించా రు. పోలింగ్ సజావుగా సాగేందుకు వీలుగా ఓటర్ల సౌకర్యార్థం పోలింగుకు ముందు రోజు ఓటర్ స్లిప్స్‌ను బూత్ లెవెల్‌అధికారుల ద్వారా ఓటర్లకు పంపిణీ చేయాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై పోలింగ్ సిబ్బం దికి నిర్దేశించిన అంశాల్లో పూర్తి అవగాహన కల్పించేం దుకు వీలుగా డీఆర్‌డీఏ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. నామినేషన్ పత్రం పూర్తి చేసే విధానంపై అభ్యర్థులకు సహకరించాలని చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను సమర్థవంతంగా అమలుచేసేందుకు సంచార నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ పరంగా సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల సక్రమ నిర్వహణకుగాను సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలకు ఖమ్మం ఆర్డీవోను, ఇల్లందు, కొత్తగూడేనికి కొత్తగూడెం ఆర్డీవోను బాధ్యులుగా నియమించారు. అనంతరం, సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై డీఆర్‌వో, కొత్తగూడెం, ఖమ్మం ఆర్డీవోలతో కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశాలలో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, డీఆర్‌వో శివశ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారి వేణు మనోహర్, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి(ఖమ్మం), అమయ్‌కుమార్(కొత్తగూడెం) పాల్గొన్నారు.
మున్సి‘పోల్స్’ను పారదర్శకంగా నిర్వహించాలి
Published Thu, Mar 6 2014 2:43 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement