రాజకీయాల్లోకి రావటమే నా తప్పు: దాసరి | My mistake to get into politics:dasari | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి రావటమే నా తప్పు: దాసరి

Published Tue, May 12 2015 2:01 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

రాజకీయాల్లోకి రావటమే నా తప్పు: దాసరి - Sakshi

రాజకీయాల్లోకి రావటమే నా తప్పు: దాసరి

హైదరాబాద్: రాజకీయాల్లోకి రావటమే జీవితంలో తాను చేసిన తప్పు అని కేంద్ర మాజీమంత్రి, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు 71వ జన్మదినోత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ దాసరి నారాయణరావు స్వర్ణకంకణాన్ని ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మలకు ప్రదానం చేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ ‘ 50 సంవత్సరాలు తెల్లటి దుస్తులతో తెల్లగా జీవించాను. కానీ ఒక మచ్చ వేశారు. అది కూడా తారుతో వేశారు. ఒకరిని కాపాడేందుకు బొగ్గు స్కాంలో నన్ను ఉపయోగించుకొన్నారు. ఆ మచ్చలు తారుతో వేసినవైనా, బురదతో వేసినవైనా సరే తెల్లగా మళ్లీ మీ ముందు కన్పిస్తాను.’ అని దాసరి చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement