కీచక గురువుపై నిర్భయ కేసు | Nirbhay case filed against a Teacher for sexuall harassment on 5th class student | Sakshi
Sakshi News home page

కీచక గురువుపై నిర్భయ కేసు

Published Sat, Jan 25 2014 6:13 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

కీచక గురువుపై నిర్భయ కేసు - Sakshi

కీచక గురువుపై నిర్భయ కేసు

విశాఖపట్నం :  గత రెండు నెలలుగా ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడున్న ఉపాధ్యాయుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ది ప్రొటక్షన్‌ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రం సెక్సువల్‌ ఆఫెన్సెస్‌ చట్టాల కింద ఎయిర్ట్‌పోర్టు జోన్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

గోపలపట్నం సమీపంలోని కొత్తపాలెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సింహాచలం... గత కొంతకాలంగా అయిదో తరగతి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో విద్యార్థినిని తన ఇంటికి తీసుకు వెళుతున్న సయయంలో మహిళ సంఘాల నేతలు, విద్యార్థిని బంధువులు కీచక టీచర్ను పట్టుకుని రోడ్డుపై చితకొట్టారు.

ఉపాధ్యాయుడు సింహాచలం కొద్దిరోజులుగా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో ఆ విద్యార్థిని స్కూల్కు వెళ్లేందుకు విముకత చూపిస్తోంది. దాంతో విద్యార్థిని బంధువులు విచారించగా అసలు విషయం బయటపడింది. దాంతో కామాంధుడిని వలవేసి పట్టుకుని బడితెపూజ చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement