అధ్యాపకురాలిపై లైంగికదాడి: విద్యార్థి అరెస్ట్
Published Fri, Apr 1 2016 9:37 PM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM
కేకే.నగర్: నామక్కల్ సమీపంలో అధ్యాపకురాలిపై అత్యాచారం జరిపిన ఇంజనీరింగ్ విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నామక్కల్ జిల్లా ఎరుమిపట్టి కైక్కాట్టి ప్రాంతానికి చెందిన యువతి (27). ఈమె తిరుచ్చిలోని ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్‌గా పనిచేస్తోంది.
ఈమెకు వడుకపట్టికి చెందిన సుబ్రమణితో 2008లో పెళ్లైంది. 2010లో మగబిడ్డ పుట్టిన అనంతరం దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె భర్తను వదలి పుట్టింటికి చేరింది. ఈమె ఇంటి సమీపంలో ధర్మపురి జిల్లా జిట్టాంపట్టికి చెందిన రత్నం కుమారుడు కన్నన్ (21) నివసిస్తున్నాడు. కన్నన్ మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ స్థితిలో యువతికి, కన్నన్‌కు మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో చనువుగా ఉండేవాడు.
విడాకులు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటానని మెను నమ్మించాడు. ఈ స్థితిలో యువతి గర్భం దాల్చింది. విడాకులు వచ్చాక యువతి కన్నన్‌తో విషయం తెలిపింది. వెం టనే కన్నన్ శాంతితో చెప్పకుండా పరారయ్యాడు. తనపై అత్యాచారం జరిపిన కన్నన్‌పై చర్య తీసుకోవాలని కోరు తూ యువతి నామక్కల్ జిల్లా ఎస్పీ మహేశ్వరికి ఫిర్యాదు చేసింది. ఆమె ఆదేశాల మేరకు నామక్కల్ మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ జయంతి కన్నన్ అరెస్టు చేశారు.
Advertisement
Advertisement