విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు | girl student sexual harassment by teacher | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

Published Sat, Jan 24 2015 11:37 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

girl student sexual harassment by teacher

రాజంపేట: వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలోని ఉర్దూ పాఠశాలలో ఓ విద్యార్థిని(12)పై అదే పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటికి పొక్కటంతో కుటుంబసభ్యులు అతనికి దేహశుద్ధి చేశారు. వివరాలు... స్థానికంగా ఉండే ఉర్దూ పాఠశాలలో విద్యార్థిని ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు అజీజ్ కొన్ని రోజులుగా సదరు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు.

దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలపటంతో వారు శనివారం పాఠశాలకు చేరుకుని, ఉపాధ్యాయుని నిలదీశారు. అనంతరం ఆగ్రహంతో అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement