విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు | Teacher-student sexual harassment | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

Published Fri, Nov 14 2014 1:20 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Teacher-student sexual harassment

  • నిర్భయ చట్టం కింద కేసు నమోదు
  • ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థినిపై అదే పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  సీఐ హరిచంద్ కథనం ప్రకారం.. పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో టీచర్స్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు దేవాసిన్ వారం రోజులుగా సదరు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో విద్యార్థిని తండ్రి మహిళా పోలీసుస్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవాసిన్‌పై నిర్భయ, ఫ్యాక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement