వాయిదాలే వాయిదాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చట్టసభల సమావేశాలు దాదాపు పక్షం రోజుల తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పూలేదు. గత సమావేశాల నాటి పరిణామాలే ఉభయ సభల్లోనూ చోటు చేసుకున్నాయి. శుక్రవారం మొదటిరోజు ఎమ్మెల్యేలు ప్రాంతాలవారీగా, పోటాపోటీగా పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పలుమార్లు వారుుదా అనంతరం చివరకు ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకుండానే శనివారానికి వారుుదాపడ్డారుు. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్సార్‌సీపీ, సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, టీ బిల్లుపై వెంటనే చర్చ చేపట్టాలని తెలంగాణ ప్రాంత సభ్యులు పట్టుబడుతూ అసెంబ్లీని స్తంభింపజేశారు. ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే సభాపతి స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
సమైక్య తీర్మానం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన ఆ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ, ఇతర సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని, రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత ైవె ఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ ‘సమైక్యాంధ్ర ప్రదేశ్ వర్థిల్లాలి’ అంటూ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు ప్రారంభించారు. టీడీపీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా పోడియంలోకి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినాదాలు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తక్షణమే తెలంగాణ బిల్లుపై చర్చించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపడదామని ప్రకటించినా పట్టించుకోకుండా తక్షణమే బిల్లుపై చర్చ చేపట్టాలని కోరారు.
సభ సజావుగా సాగడానికి సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తొలిసారిగా అరగంటపాటు స్పీకర్ సభను వాయిదా వేశారు. తర్వాత 10.30 గంటలకు సభ ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో గంటపాటు వాయిదా వేశారు. మూడోసారి 12.39 నిమిషాలకు ప్రారంభమైన తర్వాత సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగించడంతో.. ‘చర్చకు సహకరించండి. మీ మనోభావాలు తెలపండి. సభా సమయం వృథా కాకుండా సహకరించండి. పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించవద్దు. బిల్లుపై అర్ధవంతమైన చర్చకు సహకరించండి..’ అని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. అరుుతే ఎమ్మెల్యేలు శాంతించకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
మండలిలోనూ అదే పరిస్థితి: మండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగా ఉంచాలని.. అందుకోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. టీడీపీ సభ్యులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చించాలంటూ డిమాండ్ చేయడంతో సభ నడిచే పరిస్థితి లేకుండా పోయింది. మూడుసార్లు సభను వారుుదా వేసినా మార్పు లేకపోవడంతో మండలిని శనివారానికి వాయిదా పడింది.