
`తెలంగాణ బిల్లు అడ్డుకునే హక్కు లేదు`
వరంగల్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో తెలంగాణ, సీమాంధ్రలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చపై అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమే ఉందని, అడ్డుకునే హక్కులేదని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు.
శుక్రవారం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో చర్చ సందర్భంగా చెప్పిన అభిప్రాయాలను కేంద్ర పరగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.