హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు రానున్న కీలక తరుణంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతల్లో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. దీంతో ఇరుప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎంపీలు తమ పార్టీ అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతితోనే సమైక్యం కోసం పోరాడుతున్నామని తెలిపారు.
తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ తాము రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తామని చెప్పారు. కాగా, 2008లో తెలంగాణపై ఇచ్చిన లేఖకు కాలం చెల్లిందంటూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు విమర్శించారు.