
అవయవదానంపై అవగాహన ర్యాలీ
కృష్ణా: విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వరకు గురువారం అవయవదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీర పాండ్యన్ ప్రారంభించారు. అవయవదానం చేయండి-ప్రాణాలు కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకొని వైద్య విద్యార్థులు నగర వీధులలో ర్యాలీ తీశారు.
ఈ ర్యాలీలో హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజుతో పాటు వివిధ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.