మన్వితకు ఫస్ట్ ర్యాంకు
విజయవాడ: నీట్-2017 మెడికల్ లోకల్(ఏపీ) ర్యాంకులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేసింది. ఏపీ నుంచి 32,392 మంది విద్యార్థులు ఉత్తీరణ సాధించారు. రాష్ట్ర స్థాయిలో నర్రెడ్డి మన్విత మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఆమెకు 14వ ర్యాంకు దక్కింది.
రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో సాయిశ్వేత(రెండు), ఫణి లాస్య(మూడు), మనోజ్ పవన్‌రెడ్డి(నాలుగు), వంశీకృష్ణ(ఐదు), చైతన్య గోపాల్(ఆరు), వీరమచనేని జైత్రి(ఏడు), నల్లమిల్లి సాత్వికారెడ్డి(ఎనిమిది), పవన్ కుమార్(తొమ్మిది), మోతీలాల్(పది) టాప్‌టెన్‌లో నిలిచారు.
సీట్ల భర్తీకి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. కన్వీనర్ కోటాలో 2,927, మేనేజ్‌మెంట్ కోటాలో 730, ఎన్‌ఆర్‌ఐ కోటాలో 343 సీట్లు భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి తుది మెరిట్ లిస్టును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటిస్తుంది.