వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఓ వృద్ధుడు ఏరు దాటుతూ మృతి చెందాడు. భారీ వర్షాలకు వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు సాహసం చేసి రామయ్యపాలెం ఎస్టీ కాలనీకి చెందిన లక్ష్మయ్య (65) శనివారం సాయంత్రం ఏరు దాటబోయాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయి మృతి చెందాడు. అయితే, గ్రామానికి రాకపోకలు లేకపోవడంతో ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగుచూసింది.