వైరామవరం: తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం సింగవరంలో ప్రమాదవశాత్తూ పాపారావు(80) అనే వృద్ధుడు సజీవదహనమయ్యాడు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వృద్ధ దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా దీపం అంటుకుని ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పాపారావు సజీవదహనం అవ్వగా, వృద్ధుడి భార్య లక్ష్మమ్మ(70) అదృష్టవశాత్తూ బయటపడింది. లక్ష్మమ్మ కేకలు వేసినా సరైన సమయంలో ఇరుగుపొరుగు వారు రావడంలో ఆలస్యం కావడంతో వృద్ధుని కాపాడలేకపోయాడు.