తిరుమల: రాజకీయ పార్టీలు మారేవారు, తీసుకునేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ టికెట్టుపై గెలిచి, మరో పార్టీలోకి మార డం నైతికంగా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు నమ్మి ఓటే సిన పార్టీని కాదని, మరోపార్టీ మార డం అన్నదానిపై వారు ఆత్మవిమర్శ చేసుకుంటే సమాధానం తప్పక వస్తుందన్నారు.
ప్రభుత్వంలో అభివృద్ధి కంటే ఆడంబరాలు పెరిగాయన్నారు. ఈ పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉందన్నారు. ఈ పరిస్థితి మారకపోతే భవిష్యత్‌లో ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చావులేదని, మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశా రు. రాష్ట్ర విభజనలో చెడులో మంచి జరుగుతోందని, దీనివల్ల విద్య, వైద్యం పరంగా సరికొత్త సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు.