సనత్‌నగర్ (హైదరాబాద్) : నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి( పీసీబీ) కార్యాలయ ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేసి తమ దాతృత్వాన్ని చాటారు. తమ వేతనాల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా అందజేశారు. రూ.1,36,300లను చెక్ రూపంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బీబీఎస్ ప్రసాద్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధికి మంగళవారం అందించారు.