సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నడవలేక.. కళ్లు సరిగా కనిపించని వృద్ధులు, వికలాంగులకు ముఖ్యమంత్రి బాబు కొత్తకష్టాలు తెచ్చిపెట్టారు. చివరి మజిలీలో వారిప్రశాంతతను దూరం చేశారు. ప్రభుత్వం ఇచ్చే పింఛను కోసం ఎండలో.. గంటల తరబడి క్యూలో నిల్చోవటం కనిపించిం ది. అదేవిధంగా కాళ్లు, చేతులు, కళ్లు లేని వికలాంగులు సైతం ప్రభుత్వం ఇచ్చే భృతి కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. వైఎస్సార్ హయాంలో వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా పింఛను మొత్తాన్ని ఇంటికే వచ్చి ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ విధానం పూర్తిగా మారింది. రకరకాల కొర్రీలు పెట్టి వేలాదిమందిని తొలగించారు. అదేవిధంగా అర్హుల ఇంటికే చేర్చే విధానానికి నీళ్లొదిలారు. పండుటాకులు, వికలాంగులను రోడ్డుమీద గంటలకొద్దీ నిలబెట్టి వేలిముద్రలు, ఆధార్ కార్డుల పరిశీలించి పింఛన్‌ను ఇచ్చిపంపుతున్నారు.
జిల్లాలో 2,47,965మందివృద్ధులు,వికలాంగులు, వితంతువులకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్లు బుధవారం నుంచి పోస్టాఫీసుల ద్వారా ప్రారంభమైంది. బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ మొదటిరోజు గందరగోళంగా మారింది. ఈ విధానంపై అధికారులకు అవగాహన లేకపోవటం.. అర్హులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవటం కనిపించిం ది. బుధవారం జిల్లావ్యాప్తంగా ‘సాక్షి’ చేపట్టిన విజిట్‌లో లబ్ధిదారులు పడుతున్న కష్టాలను తెలుసుకుంది.
మ్యాచ్ కాని వేలిముద్రలు
అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇటీవల వృద్ధులు, వికలాంగుల నుంచి వేలి ముద్రలు, ఐరిస్, ఆధార్ కార్డు నంబర్లను తీసుకుంది. కొద్దిరోజుల ముందు తీసుకున్న వేలిముద్రలు, ఆధార్ నంబర్లను బయోమెట్రిక్ సిస్టమ్ గుర్తించడం లేదు. ఆ వేలిముద్రలు, ఆధార్ నంబర్లు తప్పని చెపుతుండటంతో జిల్లావ్యాప్తంగా వేలాది మందిని తిప్పిపంపేశారు.
అదేవిధంగా అనేక ప్రాంతాల్లో బయోమెట్రిక్ సిస్టమ్ పనిచేయకపోవటంతో సాయంత్రం వర కు వేచి ఉండి ఒట్టిచేతులతో తిరిగి వెళ్ల టం కనిపించింది. వేలిముద్రలు, ఆధార్ నంబర్లు తప్పు ఉందని చెప్పటంతో అనేకమంది మీసేవ కేంద్రాలకు, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నారు. సైదాపురం, ఉదయగిరి పరిధిలో పోస్టాఫీసులకు పింఛను నిధులు రాకపోవటంతో పంపిణీ ఆలస్యమైంది. సూళ్లూరుపేట పరిధిలో బుధవారం పింఛన్ల పంపిణీ ప్రక్రియే ప్రారంభం కాలేదు.
రైతులు.. చేనేతలకు కొత్త కష్టాలు
రైతులు, చేనేత కార్మికుల వేలి ముద్రలు మ్యాచ్ కావటం లేదు. వీరు రోజూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండటం.. కష్టపడటంతో చేతివేళ్లు కొంత అరిగిపోయి ఉంటాయి. అదేవిధంగా చేనేతలు రోజూ బట్టలకు రంగులు అద్దుతుంటారు. ఈ కారణాలతో నాడు తీసుకున్న వేలిముద్రలకు.. నేడు తీసుకుంటున్న వేలిముద్రలకు తేడా కనిపిస్తోంది.
పడిగాపులు కాస్తేనే.. పింఛన్
Published Thu, Feb 5 2015 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement