
అబ్దుల్ ఖాదర్‌కు నిత్యావసర వస్తువులు అందిస్తున్న గౌస్‌బాషా
ప్రొద్దుటూరు : పేద కుటుంబానికి ఓ దాత సాయం చేశారు. రిక్షా కార్మికుడు అబ్దుల్ ఖాదర్ కుటుంబ పరిస్థితిపై ‘విరిగిన బతుకు బండి’ అనే కథనం ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన శ్రీనివాసనగర్‌కు చెందిన ఏసీ మెకానిక్ గౌస్ బాషా నిత్యావసర వస్తువులతోపాటు ఆర్థిక సాయం అందించారు. తనకు చేతనైన సాయం చేశానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు సత్యం పాల్గొన్నారు.