పది శాతం భారం
సాక్షి, తిరుపతి: ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రయాణికులపై పది శాతం భారం పడింది. వెన్నెల సర్వీసు మినహా, మిగిలిన అన్ని బస్సు సర్వీసులలో ప్రయాణికులపై భారం మోపింది. జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోజుకు 5.4 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. తద్వారా రోజుకు కోటి పది లక్షల రూపాయలకు పైగా ఆదా యం వస్తోంది. బస్సు చార్జీలు పది శాతం పెంచడంతో పల్లెవెలుగు బస్సుల నుంచి లగ్జరీ, వోల్వో బస్సుల వరకు ప్రయాణికుల జేబులకు చిల్లుపడుతోంది. దీం తో జిల్లాలో రోజుకు ఆర్టీసీ ఆదాయం రూ. 1.30 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు తెలిపా యి. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులపై కూడా ప్రయాణ భారం పడుతోంది. తిరుపతి, తిరుమల మధ్య 41 రూ పాయలు ఉండగా పెరిగిన చార్జీల మేరకు 45 రూపాయలకు చేరింది. తిరుపతి-చిత్తూరు మధ్య 55 ఉండ గా ప్రస్తుతం 62 రూపాయలకు చేరింది. కాణిపాకంకు 58 నుంచి 63 రూపాయలకు పెరిగింది. తిరుపతి- చెన్నై మధ్య 195 నుంచి 215 రూపాయలకు పెరిగింది.
పెంపు దురదృష్టకరం
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడం దురదృష్టకరమని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడం వల్లే ఆర్టీసీ ఆర్థి క పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో, డీజిల్‌పై రాష్ట్ర పన్నును తగ్గించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంద ని ఆరోపించారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం గా ఉన్నపుడు ఒక్క పైసా కూడా చార్జీలు పెంచని విషయాన్ని గుర్తు చేశారు. సీఎం, రవాణా శాఖ మంత్రి ఉత్తు త్తి హామీలతో సంస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రీజనల్ కార్యదర్శి పీసీ బాబు, తిరుమల డిపో అధ్యక్షుడు రవిశంకర్, తిరుపతి డిపో అధ్యక్షుడు గోపాల్, అలిపిరి డిపో అధ్యక్షుడు బాబు, రీజనల్ కమిటీ సభ్యులు మల్లికార్జునయ్య, ప్రకాష్, రాజేంద్ర, ఎంఎన్ బాబు పాల్గొన్నారు.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక పక్క నిత్యావసర వస్తువులు, కూరగాయలు, సిలిండర్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సందిట్లో సడేమియా అన్నట్లుగా ఆర్టీసీ చార్జీలు పెంచేశారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడతోంది. పునరాలోచన చేయాలి.
- హేమ, గృహిణి, పుత్తూరు
చార్జీల పెంపును వెనక్కు తీసుకోండి
ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం పెంచడంతో వూ లాంటి సావూన్యులపై ఎం తో భారం పడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే వుూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. సావూన్య ప్రజల సవుస్యలను దృష్టిలో ఉంచుకుని చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.
- శేఖర్, శ్రీకాళహస్తి
ధరల ప్రభుత్వాన్ని గద్దె దించాలి
నిత్యావసర వస్తువుల ధరలతో పాటు సావూన్యులు ప్రయూణించే ఆర్టీసీ బస్సు చార్జీలను పది శాతం పెంచడం బాధాకరం. ప్రజల రక్తవూంసాలతో ఖజానా నింపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కొనసాగే నైతికత లేదు.
- భారతి, ప్రయూణికురాలు, తాడిపత్రి
ధరల అదుపులో ప్రభుత్వం విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను అదుపు చేయుడంలో ఘోరంగా విఫలమవుతోంది. సావూన్యుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా పేదల నడ్డి విరుస్తున్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలను పది శాతం పెంచ డం బాధాకరం. వెంటనే చార్జీలను తగ్గిం చేలా చర్యలు తీసుకోవాలి.
- రవీంద్ర, ప్రయూణికుడు, తాడిపత్రి
బస్సు చార్జీల పెంపు బాధాకరం
ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచడం చాలా బాధాకరం. సమ్మె కాలంలో జరి గిన నష్టాన్ని పూడ్చుకునేందుకు సామాన్యులపై భారం మోపడం ఎంతవరకు సమంజసం. ఏడాదికి నాలుగైదు సార్లు బస్సు చార్జీలు పెంచుతా ఉంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
- పుష్పరాజ్, టీచర్, పలమనేరు
ఈ ప్రభుత్వం పేదలతో ఆడుకుంటోంది
చీటికిమాటికి బస్సు చార్జీలు పెంచేస్తుంటే మాలాంటి పేదల పరిస్థితి ఏం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ సార్లు డీజిల్ ధరలు పెంచారు. ఇంత ఘోరమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుం దా. ప్రజల రక్తాన్ని ఇలా తాగుతూ పోతే మాలాంటోళ్లు ఎలా బతకాలి.
- వేమన్న, టీ.వడ్డూరు, పలమనేరు
బస్సు చార్జీల పెంపు మాకు భారమే
చార్జీల పెంపుతో బస్సుల్లో ప్రయాణించాలంటే మాకు భారంగా ఉంటుంది. గతంలో ఎప్పుడూ ఒకేసారి నాలుగు రూపాయలు పెంచలేదు. ప్రస్తుతం పెరి గిన చార్జీలతో పల్లెకు వెళ్లాలంటే కష్టమే. అత్యవసరాలకు తప్ప మిగతా సమయా ల్లో ప్రయాణించలేము.
- రెడ్డప్పరెడ్డి, కోసువారిపల్లె,
తంబళ్లపల్లె మండలం
నడకదారే గత్యంతరం
కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచుతూపోతే సామాన్యుడు ఎలా ప్రయాణం చేయాలి. ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు బస్సు చార్జీలను పెంచితే సామాన్యుడికి నడకదారే గత్యంతరం. - కేసీ.కుసుమకుమారి, మాలమహానాడు
రాష్ట్ర కార్యదర్శి. తిరుపతి
ప్రయాణాలు తగ్గించుకోవాల్సిందే
ఈ ప్రభుత్వం సామాన్యుడి పరిస్థితిని పట్టించుకోవడం లేదు. వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ఎన్నడూ ధరలు పెరిగిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వంలో సా మాన్యుడి నడ్డి విరిగేలా ధరలు పెంచుతు పోతున్నారు. ఇలా అయితే ఆర్టీసీ ప్రయాణాలు తగ్గించుకోవాల్సిందే.
- రాధికాబాయ్, గృహిణి, తిరుపతి
ఆర్టీసీ చార్జీల పెంపుపై భగ్గుమన్న జనం
Published Wed, Nov 6 2013 2:33 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement