తిరుపతి:కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధాన రాజకీయ పక్షల నే తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మం డిపడుతున్నారు. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హో దా ఆశలను చెరిపివేసింది. ఈ ప్రభావం జిల్లాలోని సాగు, తాగునీరు, పరిశ్రమ లు, వైద్య, విద్యా రంగాలపై పడనుంది. ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్ర ప్రణాళిక శాఖ ఇండిపెం డెంట్ ఇన్‌చార్జి మంత్రి ఇందర్‌జిత్‌సింగ్‌రావు స్పష్టం చేశారు.
శుక్రవారం బీహర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ఎంపీ రాజేష్ రాజన్ లోక్‌సభలో లేవనెత్తిన చర్చకు మంత్రి పైవిధంగా ప్రకటన చేశారు. కేంద్ర పన్నుల వాటాను 32 శా తం నుంచి 42 శాతానికి పెంచామని దీంతో ఇకపై ఏరాష్ట్రానికి ప్రత్యేక హో దా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఈ విష యం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రా ష్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేం ద్రాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పటికే వైఎ స్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జం తర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ప్రకటించడం గమనార్హం. అన్ని రంగా ల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనివార్యమని జిల్లా వాసులు ముక్తకంఠంతో పేర్కొం టున్నారు. ఈ విషయమై ఎవరే మం టున్నారో వారి మాటల్లోనే...
కేంద్రాన్ని నిలదీసే సత్తా బాబుకు లేదు
రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని నిలదీసిన బీజేపీ నేడు ఆ హోదా కల్పిచకుండా చేతులెత్తేసింది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడ బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించలేకపోవడం దారుణం. రాష్ట్రంలో అధికారంలో ఉండి, కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై దేశ ప్రధానిని ఎదురించే దమ్ము లేదు.
- నారాయణస్వామి,
గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే అంధ్ర ప్రజలకు ద్రోహం
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రా ష్ట్రానికి ప్రత్యేక హోదా క ల్పనకు మద్దతిచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన త రువాత ఆంధ్ర ప్రజలను మోసం చేసింది. రాష్ట్ర వి భజన సమయంలో రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాటమార్చి ద్రోహం చేశారు. దీనికి బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమించాలి. - కందారపు మురళి,
జిల్లా ప్రధానకార్యదర్శి, సీఐటీయూ
అసమర్థ సీఎం బాబు
ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. సీఎం చం ద్రబాబు, వెంకయ్యనాయుడులు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా కుట్రపన్నుతున్నారు. వెంకయ్యనాయుడు వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ప్రత్యేక హోదాపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సీపీఐ ఆ ధ్వర్యంలో ఒకటో తేదీ శ్రీకాకుళం నుంచి జాతాలు నిర్వహిస్తాం. ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పి లుపునిచ్చాం.
-ఏ. రామానాయుడు, జిల్లా కార్యదర్శి, సీపీఐ
బీజేపీపై జనం భగ్గు
Published Sat, Aug 1 2015 2:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement